
సొరాటా తయారీకి కావల్సినవి:
సొరకాయ లేదా గుమ్మడి తురుము – మూడు టేబుల్ స్పూన్లు;
శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను;
అల్లం తరుగు – టేబుల్ స్పూను; పసుపు – ముప్పావు టీస్పూను;
ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; నెయ్యి – టీస్పూను.
తయారీ విధానమిలా:
పెద్దగిన్నెలో సొరకాయ తురుము, శనగపిండి, పుదీనా, అల్లం తరుగులు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
చివరిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి ∙ఈ ముద్దను ఉండలుగా చేసి పరాటాల్లా వత్తుకోవాలి.
కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సొరాట రెడీ.
Comments
Please login to add a commentAdd a comment