పండగొస్తుంది.. తియ్యటి వేడుక చేసుకుందాం, చమ్‌చమ్‌తో | How To Prepare Bengali Cham Cham Sweet Recipe In Telugu, Step By Step Process Inside - Sakshi
Sakshi News home page

Bengali Cham Cham Sweet Recipe: పండగొస్తుంది.. తియ్యటి వేడుక చేసుకుందాం, చమ్‌చమ్‌తో

Published Tue, Aug 29 2023 4:40 PM | Last Updated on Tue, Aug 29 2023 4:57 PM

How To Make Cham Cham Sweet Recipe In Telugu - Sakshi

చమ్‌చమ్‌ తయారీకి కావలసినవి
వెన్నతీయని ఆవుపాలు – నాలుగు కప్పులు; 
నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు; మైదా – టేబుల్‌ స్పూను; చక్కెర – ఒకటిన్నర కప్పులు;
నీళ్లు – ఎనిమిది కప్పులు; యాలకులు – రెండు; నెయ్యి – టీస్పూను; పాలు – పావు కప్పు; క్రీమ్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు;
పాలపొడి – అరకప్పు; కుంకుమ పువ్వు కలిపిన పాలు – రెండు టేబుల్‌ స్పూన్లు; చక్కెరపొడి –టేబుల్‌ స్పూను;
కొబ్బరి తురుము – పావు కప్పు; ట్యూటీఫ్రూటీ –మూడు టేబుల్‌ స్పూన్లు



తయారీ విధానమిలా:
► పాలను చక్కగా కాయాలి..కాచిన పాలల్లో నిమ్మరసం వేసి విరగగొట్టి.. పన్నీర్‌ను వేరు చేసి పక్కనపెట్టుకోవాలి.
► అరగంట తరువాత పన్నీర్‌ మిశ్రమంలో మైదా వేసి ముద్దలా కలపాలి ∙ముద్దను పొడవాటి రోల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
► ఇప్పుడు పంచదారలో ఎనిమిది కప్పులు నీళ్లుపోసి 10 నిమిషాలు మరిగించాలి.
► తరువాత యాలకులు, పన్నీర్‌ రోల్స్‌ను వేసి పదిహేను నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నెయ్యి, పావు కప్పు పాలు పోసి మరిగించాలి.


► రెండు నిమిషాల తరువాత క్రీమ్‌ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, పంచదార పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
మిశ్రమం బాగా చిక్కబడినప్పుడు దించేస్తే కోవా రెడీ.
► ఇప్పుడు సుగర్‌ సిరప్‌లో ఉడికించిన రోల్స్‌ను బయటకు తీసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చల్లారిన కోవా మిశ్రమాన్ని స్టఫ్‌చేసి గాటుని మూసేయాలి.
► ఈ రోల్స్‌కు కొబ్బరి తురుము అద్ది, పైన టూటీఫ్రూటీపెట్టాలి ∙ఇలా అన్నీ రోల్స్‌ను చేస్తే చమ్‌చమ్‌ రెడీ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement