స్నాక్స్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ఇంట్లోవారికి, ఆఫీసుల్లో పనిచేసేవారికి, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందైతే స్నాక్స్ తినకుండా పనిచేయరు. సాయంత్రమైతే చాలు నోరు లాగేస్తుంది.. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. స్నాక్స్‌లో బ్రెడ్‌తో చేసే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వడాపావ్, పావ్ బాజీ, మిసాల్ పావ్. ఇవన్నీ మహారాష్ట్రలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్.
మిసల్ పావ్..
మహారాష్ట్రలోని పావ్ ఆధారిత స్ట్రీట్ ఫుడ్స్‌కు చెందిన ప్రముఖ వంటకం మిసల్ పావ్. ఇది రోడ్‌సైడ్ స్టాల్స్, బ్రేక్‌ఫాస్ట్ జాయింట్‌లు, ఆఫీస్ క్యాంటీన్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. మాత్ బీన్స్ మొలకలు(అలసంద గింజలు), కొబ్బరి, టమాటా, మసాలా దినుసులతో స్పైసీ కూరలాగా తయారు చేస్తారు. తరువాత దీనిపై సేవ్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి బ్రెడ్‌తో వడ్డిస్తారు. అయితే మిసల్ పావ్‌లో ఉపయోగించే పదార్థాలు, ప్రదేశాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. పుణె మిసల్, ఖండేషి మిసల్, నాసిక్ మిసల్, అహ్మద్‌నగర్ మిసల్ ప్రఖ్యాతిగాంచాయి.
2015లో లండన్‌లోని ఫుడీ హబ్ అవార్డ్స్‌లో మిసల్ పావ్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాఖాహార వంటకంగా పేరు పొందింది. ఈ అవార్డును ఆస్వాద్ రెస్టారెంట్ గెలుచుకుంది. ఈ రెస్టారెంట్‌ను 1986లో బాల్ థాకరే ప్రారంభించారు. ఇది ప్రతిరోజూ 400 ప్లేట్ల కంటే ఎక్కువ మిసాల్ పావ్‌ను అందజేస్తుందని నివేదిక వెల్లడించింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత.. ఈ వంటకం మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మిసల్ పావ్ మళ్లీ మొదటి స్థానం సంపాదించింది.
ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని బెస్ట్-రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసాల్ పావ్ 11వ స్థానానికి చేరుకుంది. వీటితోపాటు మరో మూడు వంటకాలు ఆలూ గోబీ, రాజ్మా, గోబీ మంచూరియన్ కూడా టాప్ 25లో నిలిచాయి. ఆలూ గోబీ 20వ స్థానంలో నిలిచింది, రాజ్మా 22వ స్థానంలో నిలిచింది మరియు గోబీ మంచూరియన్ 24వ స్థానంలో నిలిచింది. ఇవేగాక మసాలా వడ 27వ స్థానంలో, భేల్‌పురి 37వ స్థానంలో, రాజ్మా చావల్ 41వ స్థానంలో నిలిచారు. మొత్తం టాప్ 50లో భారత్ నుంచి ఏడు వెజిటేరియన్ వంటకాలు ఎంపికయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment