vegetarian food
-
వెజ్ మెమరి ఫుల్..
సాక్షి, సిటీబ్యూరో: శాకాహారంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.. అయితే మానసిక ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు తేలి్చచెప్పారు. శాకాహారంతో మెదడు పనితీరు మెరుగు పడుతుందని, డిప్రెషన్ తగ్గుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని గుర్తించారు. వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మంచన నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం వివరాలు యురోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 40 ఏళ్లు దాటిన 304 మందిపై 6 నెలల పాటు వర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. శాకాహారులు, మాంసాహారులు మధ్య మానసిక, జ్ఞాపకశక్తి అంశాలలో ఉన్న తేడాలను పరిశోధించారు. శాకాహారం తిన్నవారిలో ప్రొటీన్, కాల్షియం, ఫోలేట్, విటమిన్ సీ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాకపోతే వీరిలో విటమిన్ బీ–12 స్థాయి చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ఇక, మాంసాహారం తిన్నవారిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, రైబోఫ్లావిన్, ఇనుము, విటమిన్ బీ ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.విరివిగా యాంటీ ఆక్సిడెంట్లు..శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషించే యాంటీ ఆక్సిడెంట్లు.. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవారిలో విరివిగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా మానసిక ఒత్తిడి భారీగా తగ్గిందని, వీరిలో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. మెదడు పనితీరులో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా తీసుకోవడంతో మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడిందని వెల్లడించారు. లాభాలు ఎన్నో శాకాహారం తీసుకోవడం వల్ల మానసికపరమైన లాభాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి లాభాలు చేకూరుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులను మన ఆహారంలో భాగం చేస్తే డిప్రెషన్, యాంగ్జయిటీ దరిచేరవని చెప్పొచ్చు. – డాక్టర్ వరలక్ష్మి మంచన, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ వర్సిటీ -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి:కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీ సాగు తగ్గడంతో బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమోటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
మన పులిహోర.. చద్దన్నం అదుర్స్
సాక్షి, అమరావతి: రాత్రి మిగిలిన అన్నంలో గంజిపోసి పులియబెట్టి పొద్దున్నే పచి్చమిరపకాయ లేదా ఉల్లిపాయ నంజుకుంటూ పొలం గట్లపై రైతులు, కూలీలు తినే చద్దన్నం ఇప్పుడు అంతర్జాతీయ డిష్ అయింది. ‘రాత్రి మిగిలిపోయిన ఈ అన్నం ఎవరు తింటారు?..’ అంటూ ఈ కాలం యువత తక్కువచేసి చూసే చద్దన్నాన్ని ఇప్పుడు స్టార్ హోటళ్లలో పంటాబాత్ పేరుతో స్పెషల్‌గా చేయించుకుని లొట్టలేస్తూ మరీ తింటున్నారు.అంతేనా మనం ఇంట్లో ఇష్టంగా చేసుకునే పులిహోర కూడా అంతర్జాతీయ ఫేవరెట్ వంటకంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల్లో ప్రజలు ఇష్టంగా తినే వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, ఏయే ప్రాంతాల్లో వాటిని ఇష్టపడుతున్నారు, వాటికి ఇచి్చన రేటింగ్ వంటి అంశాలను ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇటీవల టేస్ట్ అట్లాస్ ప్రకటించిన 83 శాకాహార వంటకాల్లో తొలిసారి ఆంధ్రా స్పెషల్ పులిహోర, పప్పుచారు, మిరపకాయ బజ్జీలు చోటు దక్కించుకున్నాయి.4 స్టార్ రేటింగ్‌తో పులిహోర పండగలు, ప్రత్యేక పర్వదినాల్లోను, అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లోను తప్పనిసరిగా చేసే పులిహోర టేస్ట్ అట్లాస్ రేటింగ్ 19వ స్థానంలో నిలిచింది. హిందూ ప్రపంచంలో ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ఏపీకి చెందిన ప్రత్యేక వంటకమని, అయితే.. తమిళనాడులో దీనిని పులిసాదం అని, కర్ణాటకలో పులియోగారే అని పిలుస్తారని నివేదిక పేర్కొంది. అత్యధికమంది ఆహారప్రియులు ఆంధ్రప్రదేశ్‌లో చేసే చింతపండు పులిహోరనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు రేటింగ్ ఇచ్చారు. మన రాష్ట్రం నుంచి మిరపకాయ బజ్జీ 40వ స్థానంలోను, పప్పుచారు 50వ స్థానంలోను నిలిచాయి. ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే ఆరోగ్యకరమైన వంటకంగా పప్పుచారును పేర్కొంది. టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ఈ ర్యాంకింగ్స్ వివిధ ప్రాంతాల ఆహార ప్రియుల నుంచి తీసుకున్నట్లు పేర్కొంది. టాప్ 83 భారతీయ శాఖాహార వంటకాల జాబితా కోసం ఈ నెల మే 15వ తేదీ వరకు 2,251 మంది ఇచి్చన రేటింగ్స్ ఆధారంగా ఈ జాబితాను ప్రకటించినట్టు తెలిపింది. మన గ్రామాల్లో ఇప్పటికీ రైతులు, కూలీల అల్పాహారంగా ఉన్న చద్దన్నం బంగ్లాదేశ్ సంప్రదాయ వంటకంగా గుర్తింపు పొందింది.టాప్ రేటింగ్‌తో పప్పు కూర ఎక్కువమంది ప్రజలు ఇష్టపడే వంటకాల జాబితాలో చేరింది. అంతర్జాతీయ ఫుడ్గైడ్గా గుర్తింపుపొందిన టేస్ట్ అట్లాస్ ఇప్పటివరకు 10 వేలకుపైగా వంటకాలను, 9 వేల రెస్టారెంట్లను తన అంతర్జాతీయ జాబితాలో చేర్చింది. ఇప్పుడు మన ఆంధ్రా స్పెషల్స్‌కు చోటుదక్కడం, అందులోను అందరూ ఇష్టపడే పులిహోర, పప్పుచారు, మిరపకాయ బజ్జీ, చద్దన్నం ఉండడం విశేషం. ఏపీ, ఈశాన్య భారత్, బంగ్లాదేశ్‌లలో చద్దన్నం స్పెషల్ ఈ జాబితాలో 36వ స్థానంలో ఉన్న చద్దన్నం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో తరాలుగా సంప్రదాయ అల్పాహారంగా ఉంది. ఇంట్లో టిఫిన్స్ ఉన్నా చద్దన్నం తినేవారు కోట్లలో ఉన్నారు. అయితే.. ఈశాన్య భారతదేశంతో పాటు మన పక్కనున్న బంగ్లాదేశ్‌లో చద్దన్నం వారి దేశ సంప్రదాయ అల్పాహారంగా ఉంది. ప్రోబ్యాక్టీరియా (ఆరోగ్యానికి మేలుచేసే బ్యాక్టీరియా), కొద్దిగా పర్మెంటేషన్తో ఎంతో రుచిగా ఉండే ఈ చద్దన్నాన్ని భారత్, బంగ్లాతో పాటు పలు దేశాల్లో ఇప్పుడు ఈ ఫుడ్‌ను ఎంతో ఇష్టపడుతున్నారని, ఇష్టంగా తింటున్నారని టేస్ట్ అట్లాస్ నివేదిక పేర్కొంది.బెంగాల్లో ‘పంటాబాత్’గా పేరున్న చద్దన్నం బెంగాలీ నూతన సంవత్సరం వేడుకలు, పహేలా బైషాఖీ పండుగ వంటి ప్రత్యేక సందర్భాల్లో చద్దన్నం ఉండాల్సిందేనని పలువురు ఈశాన్య, బంగ్లా, బెంగాలీ ప్రజలు పేర్కొనడం గమనార్హం. ఈ వంటకం సాధారణంగా తాజా పచ్చి మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలతో ఏపీ ప్రజలు తింటే.. వేయించిన చేపలతో బంగ్లా ప్రజలు తినడం ప్రత్యేకతగా పేర్కొంది. తొలిస్థానంలో నిలిచిన దాల్ తడ్కా టేస్ట్ అట్లాస్ ప్రకటించిన శాకాహార వంటకాల్లో ఉత్తర భారతదేశానికి చెందిన దాల్ తడ్కా తొలిస్థానంలో నిలిచింది. దక్షిణాదిన పప్పు కూరగా పిలిచే ఈ వంటకం ఉత్తర భారతదేశంలో దాల్ తడ్కాగా మారింది. ఆంధ్రాలో పప్పు కూరను పెసలు, బొబ్బర్లు, కంది, శనగ వంటి పలురకాల పప్పు దినుసులతో వండితే.. దాల్ తడ్కా మాత్రం కందిపప్పు, మసాలాతో చేస్తారు. రోటీ లేదా జీరా రైస్‌తో కలిపి ఎంతో ఇష్టంగా తింటారని చెబుతూనే ఈ వంటకానికి 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.దీనితర్వాత రెండో స్థానంలో పంజాబీ వంటకం షాహీ పన్నీర్, మూడోస్థానంలో మహారాష్ట్ర వంటకం మిసల్ (పలురకాల కూరగాయలతో కలిపి చేసేది), నాలుగోస్థానంలో మిసల్ పావ్ నిలిస్తే, ఐదోస్థానంలో 4.3 స్టార్ రేటింగ్‌తో ఆంధ్రా స్పెషల్ పెపరపప్పు కూర చోటు దక్కించుకుంది. మాంసాహార రుచుల కంటే భారతదేశపు సంప్రదాయ శాకాహార వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారని, 7, 5 స్టార్ హోటళ్లలోను ఈ రుచులకు ప్రత్యేక అభిమానులున్నారని నివేదిక పేర్కొంది. -
ఇలా చేస్తే శరీరంలో ఉన్న కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు!
ఇటీవల కాలంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. దీంతో అధిక బరువు పెరగడమే గాక ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడంతో శరీరంలో తొడలు,పిరుదులు, చేతులు భాగంలో కొవ్వు పెరిగిపోయి చూసేందుకు కూడా అసహ్యంగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వుతూ..శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ పాటించాలంటే అసాధ్యం. అందుకని ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహరంలో భాగం చేసుకుంటే సులభంగా కొవ్వు తగ్గించుకోవడమే కాదు బరువు కూడా తగ్గిపోతారు. కొవ్వుని కరిగించుకోవాలనుకుంటే తీసుకోవాలసినవి.. సెనగలు ఇవి స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్ చేస్తుంది. క్వినోవా డైట్ ప్లాన్‌లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్ ఉండదు.. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే.. శరీరానికి కావలసిన ప్రోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. టోఫు: ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. బ్రకోలీ: దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి. మొలకలు వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
Misal Pav: ప్రపంచ గుర్తింపు.. భారత్‌లో అత్యంత రుచికరమైన వేగన్ ఫుడ్ ఇదే!
స్నాక్స్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ఇంట్లోవారికి, ఆఫీసుల్లో పనిచేసేవారికి, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందైతే స్నాక్స్ తినకుండా పనిచేయరు. సాయంత్రమైతే చాలు నోరు లాగేస్తుంది.. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. స్నాక్స్‌లో బ్రెడ్‌తో చేసే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వడాపావ్, పావ్ బాజీ, మిసాల్ పావ్. ఇవన్నీ మహారాష్ట్రలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్. మిసల్ పావ్.. మహారాష్ట్రలోని పావ్ ఆధారిత స్ట్రీట్ ఫుడ్స్‌కు చెందిన ప్రముఖ వంటకం మిసల్ పావ్. ఇది రోడ్‌సైడ్ స్టాల్స్, బ్రేక్‌ఫాస్ట్ జాయింట్లు, ఆఫీస్ క్యాంటీన్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మాత్ బీన్స్ మొలకలు(అలసంద గింజలు), కొబ్బరి, టమాటా, మసాలా దినుసులతో స్పైసీ కూరలాగా తయారు చేస్తారు. తరువాత దీనిపై సేవ్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి బ్రెడ్‌తో వడ్డిస్తారు. అయితే మిసల్ పావ్లో ఉపయోగించే పదార్థాలు, ప్రదేశాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. పుణె మిసల్, ఖండేషి మిసల్, నాసిక్ మిసల్, అహ్మద్‌నగర్ మిసల్ ప్రఖ్యాతిగాంచాయి. 2015లో లండన్‌లోని ఫుడీ హబ్ అవార్డ్స్‌లో మిసల్ పావ్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాఖాహార వంటకంగా పేరు పొందింది. ఈ అవార్డును ఆస్వాద్ రెస్టారెంట్ గెలుచుకుంది. ఈ రెస్టారెంట్‌ను 1986లో బాల్ థాకరే ప్రారంభించారు. ఇది ప్రతిరోజూ 400 ప్లేట్ల కంటే ఎక్కువ మిసాల్ పావ్‌ను అందజేస్తుందని నివేదిక వెల్లడించింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత.. ఈ వంటకం మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మిసల్ పావ్ మళ్లీ మొదటి స్థానం సంపాదించింది. ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని బెస్ట్-రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసాల్ పావ్ 11వ స్థానానికి చేరుకుంది. వీటితోపాటు మరో మూడు వంటకాలు ఆలూ గోబీ, రాజ్మా, గోబీ మంచూరియన్ కూడా టాప్ 25లో నిలిచాయి. ఆలూ గోబీ 20వ స్థానంలో నిలిచింది, రాజ్మా 22వ స్థానంలో నిలిచింది మరియు గోబీ మంచూరియన్ 24వ స్థానంలో నిలిచింది. ఇవేగాక మసాలా వడ 27వ స్థానంలో, భేల్పురి 37వ స్థానంలో, రాజ్మా చావల్ 41వ స్థానంలో నిలిచారు. మొత్తం టాప్ 50లో భారత్ నుంచి ఏడు వెజిటేరియన్ వంటకాలు ఎంపికయ్యాయి. -
సింగపూర్‌లో శాకాహార హోటల్
భారత దేశానికి స్వాతంత్య్రం 1947లో వచ్చింది. సింగపూర్‌లో మొట్టమొదటి శాకాహార హోటల్ అదే సంవత్సరం ప్రారంభమైంది. 2015 లో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్, భార్య హోచింగ్లతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ హోటల్లోనే తృప్తిగా భోజనం చేశారు. అదే మురుగయ్య రాజు ప్రారంభించిన కోమల విలాస్... ఇదే ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... ఇక్కడ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అదే సంవత్సరం సింగపూర్ సెరంగూన్ రోడ్లో భారత కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించేలా మొట్టమొదటి శాకాహార హోటల్ భోజన ప్రియుల కోసం తలుపులు తెరిచి, ఆహ్వానం పలికింది. అదే కోమల విలాస్. అచ్చమైన ఈ శాకాహార హోటల్లో సింగపూర్ ప్రధాని దంపతులతో కలిసి భారత ప్రధాని ఇడ్లీ, వడ, దోసెలను ఆస్వాదించారు. తొమ్మిది దశాబ్దాల క్రితం... మురుగయ్య రాజు 1936లో తన పదహారవ ఏట సింగపూర్‌లో తమిళనాడు నుంచి పొట్ట కూటి కోసం సింగపూర్ చేరారు. ‘‘మా తాతయ్య మురుగయ్య రాజు, చిన్నవయసులోనే సింగపూర్ వచ్చి శ్రీకరుణా విలాస్‌లో పని చేశారు. ఈ హోటల్లో అన్ని పనులు తాతగారే స్వయంగా చేసేవారు. పది సంవత్సరాల పాటు అక్కడ అవిశ్రాంతంగా పనిచేసిన తాతగారు... అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించారు. ఒక మంచి రెస్టారెంటు కొనేస్థాయికి ఎదిగారు’’ అంటారు గుణశేఖరన్. శ్రీకరుణ విలాస్ అధినేత యజమానురాలి పేరు కోమల. మురుగయ్య సింగపూర్ వచ్చిన కొత్తలో ఆమె మురుగయ్యను తల్లిలా చేరదీశారు. అందువల్ల ఆయన ఆ తల్లి మీద ఉన్న గౌరవంతో తన హోటల్‌కి కోమల విలాస్ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే దొరుకుతుంది. భోజనం కూడా... తంజావూరు జిల్లాలో పనిచేస్తున్న సంప్రదాయ వంట మనిషితో మురుగయ్య రాజుకి పరిచయం కావడంతో, అల్పాహారంతో పాటు భోజనాలు కూడా ప్రారంభించారు. అది కూడా అరటి ఆకులలో వడ్డించారు. నెమ్మదినెమ్మదిగా మెనూలో కొత్త కొత్త వంటలను చేర్చారు. అవీ భారతీయ శాకాహార వంటకాలు మాత్రమే. సింగపూర్‌లో ఇంటింటా కోమల విలాస్ పేరు మార్మోగింది. అక్కడ ఎన్ని భారతీయ రెస్టారెంట్లు వచ్చినా, కోమల విలాస్‌కు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. సంప్రదాయ వంటకాలు మాత్రమే... సంప్రదాయ వంటవారిని భారతదేశం నుంచి ఎంచుకోవడమే కోమల విలాస్ విజయ రహస్యం. ‘‘భారత దేశం నుంచి మాత్రమే సంప్రదాయ వంటవారు దొరుకుతారని మా నమ్మకం. స్వయంగా భారతదేశం వెళ్లి, అక్కడి వంటవారితో వంటలు చేయించి, రుచి చూసి, నచ్చితేనే వారిని మాతో తీసుకువస్తాం. అందుకే మా దగ్గర వంట రుచిగా ఉంటుంది. ఇక్కడి శాకాహార భోజనం చాలా రుచిగా, సంప్రదాయంగా ఉంటుందనే ముద్ర పడింది కోమల విలాస్‌కి’’ అంటారు గుణశేఖరన్.ఇక్కడి వంటకాలలో మసాలా ఎక్కువగా ఉండదని తెలియడంతో, విదేశీయులు సైతం ఇక్కడ భోజనం చేయడానికి ఉబలాటపడుతుంటారు. పది సంవత్సరాల క్రితం... సింగపూర్‌కి వచ్చే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉత్తరాది వారు కూడా తరలి వస్తుండటంతో, ఆ వంటకాలను కూడా పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త వంటలతో కోమల విలాస్ నిత్యయవ్వనంగా ఉండి, సింగపూర్‌లో అందరికీ సుపరిచితంగా ఉంటోంది నేటికీ. ఉత్తర భారతదేశానికి చెందిన బ్రెడ్ బటూరాను సింగపూర్‌లో మొట్టమొదటగా పరిచయం చేసిన ఘనత కోమల విలాస్దే. ‘మా కోమల విలాస్‌కి వచ్చినవారు మసాలా దోసె తినడం మరువకండి. ఇక్కడకు వచ్చి మసాలా దోసె తిన్నవారు రుచి బాగా లేదని ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అతిథ్యం ఇవ్వడానికి మా తాతగారు స్థాపించిన కోమల విలాస్‌ను ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. భారత, సింగపూర్ ప్రధానులిద్దరూ వడ, ఇడ్లీ, రెండు రకాల దోసెలు తిన్నారు. స్వీట్ లస్సీ, మ్యాంగో లస్సీ, నిమ్మరసం కూడా తీసుకున్నారు. గుణశేఖరన్ -
అసెంబ్లీ క్యాంటీన్లో వెజ్‌లో చికెన్ ముక్కలు
ముంబై: సాక్షాత్తూ మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో వేజ్‌టేరియన్ వంటకంలో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. దీనిపై శాసనసభ్యుల్లో కలకలం రేగింది. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. వేజ్లో చికెన్ ముక్కలు వచ్చిన ఘటనపై విచారణ జరుపుతామని ఆయన సభకు హామీ ఇచ్చారు. ఎన్సీపీ సభ్యుడు అజిత్ పవార్ ఈ ఘటనను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఫడణవీస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసెంబ్లీ క్యాంటీన్లో వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నారా? శుచీశుభ్రతతో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం వంటకాలు చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం విచారిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని క్యాంటీన్ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు. గత బుధవారం ఓ ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ క్యాంటీన్లో ‘మట్కీ ఉసాల్’ అనే వేజటేరియన్ వంటకాన్ని ఆర్డర్ చేశారు. కానీ, ఆయన తింటున్నప్పుడు చికెన్ ముక్కలు దర్శనిమిచ్చాయి. దీంతో బిత్తరపోయిన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని విధానసభ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు
కాప్రా: ఆధునిక కాలంలో శాకాహారం ప్రాశస్థ్యం నానాటికీ పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లలో దీని పాత్ర ద్విగుణీకృతమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా శాకాహారానికి డిమాండ్ ఏర్పడిన ప్రస్తుత తరుణంలో జీవహింస వద్దు శాకాహారమే ముద్దంటూ చైతన్యపరిచేందుకు నడుం కట్టారు నగరానికి చెందిన దంపతులు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు. యాత్ర ఫర్ యానిమల్స్ పేరుతో స్వచ్ఛందంగా ర్యాలీలు చేపట్టారు. మాంసాహారంతో వచ్చే నష్టాలు, శాకాహారంతో ఒనగూరే ప్రయోజనాలను వివరించేందుకు దేశవ్యాప్త యాత్రకు రెండు రథాలతో శ్రీకారం చుట్టారు. పిరమిడ్ ప్రోత్సాహంతో.. ప్రస్తుత సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న రోగాల నివారణకు శాకాహారం ఒక్కటే మార్గం. దీని ద్వారానే అనేక వ్యాధులకు, అనర్థాలకు చెక్ పెట్టవచ్చనే సదుద్దేశంతో ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు పిరమిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ నుంచి ఈ ఏడాది జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ర్యాలీకి శ్రీకారం చుట్టారు. దీనిని పిరమిడ్ సొసైటీ ఫౌండర్ బ్రహ్మర్షి పత్రీజీ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలో మొదలైన యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా 54 ర్యాలీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 644 జిల్లాల్లో 44 వేల కి.మీ మేర ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు ర్యాలీల ద్వారా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. పలువురు ప్రముఖుల అభినందనలు శ్రీనివాస్, దివ్య దంపతులు చేపట్టిన ర్యాలీకి త్రిదండి చినజీయర్ స్వామితో పాటు అన్నాహజారే, గాయనీమణులు ఎస్.పి.శైలజ, ఉషా, ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్, తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు పలికిదంపతులను అభినందించారు. దేశవ్యాప్త పర్యటన అనంతరం 2019 జూన్ 21 యోగా దినోత్సవం రోజున హైదరాబాద్‌లో 25 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ముగించనున్నట్లు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు తెలిపారు. మార్పు తేవడమే మా లక్ష్యం.. మూగజీవాలను ప్రేమించాలని, మాంసాహార ప్రియులను శాకాహారం వైపు మళ్లించాలనే లక్ష్యంతో యాత్రను చేపట్టాం. శాకాహారం దారిలో వెళ్లాలని ప్రతి ఇంటికీ, ప్రతి విద్యార్థికీ చేరేలా ప్రచారం నిర్వహిస్తున్నాం. మేం చేపట్టిన ర్యాలీతో ఇప్పటికే చాలామంది శాకాహారం వైపు వచ్చారు. ఇదే ఉత్సాహంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకెళ్తాం. అందరూ శాకాహారం వైపు రావాలనేదే ర్యాలీ లక్ష్యం. – ఆచార్యశ్రీనివాస్, దివ్య -
శాకాహారంతో ఆ వ్యాధులకు చెక్
లండన్ : మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాకాహారం మేలుచేస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. శాకాహారం తీసుకోవడం ద్వారా టైప్ టూ మధుమేహంతో బాధపడేవారు బరువు తగ్గడం, గుండె జబ్బులతో మరణించే ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు పేర్కన్నారు. మాంసానికి దూరంగా ఉండటం ద్వారా ఈ రోగులు ఇన్సులిన్, కొలెస్ర్టాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును తగ్గించవచ్చని అథ్యయనం పేర్కొంది. టైప్ టూ మధుమేహంతో బాధపడే వారిలో 60 నుంచి 70 శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని అథ్యయన రచయిత, ఫిజిషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్‌కు చెందిన హనా కహ్లెవా చెప్పారు. కూరగాయలతో కూడిన ఆహారంతో గుండె సమస్యలను తగ్గించుకోవడంతో పాటు అదే సమయంలో టైప్ టూ డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. అధిక ఫైబర్, తక్కువ కొవ్వులతో కూడిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలని సూచించారు. క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
శాకాహారులకు గుండె జబ్బులు తక్కువే
న్యూయార్క్: శాకాహారం తినే వారికి గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువేనని దక్షిణాసియా వాసులపై జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. శాకాహారం తీసుకునే వారిలో లోయర్ బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఉన్నట్లు పరిశోధకుల్లో ఒకరైన భారత సంతతికి చెందిన వ్యక్తి తెలిపారు. మాంసం తినేవారితో పోలిస్తే శాకాహారుల్లో నడుము చట్టుకొలత చిన్నగా ఉన్నట్లు, పొట్టలో కొవ్వు తక్కువగా ఉన్నట్లు, తక్కువ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను బోస్టన్‌లో జరిగిన న్యూట్రిషన్-2018 సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు. సరాసరి 55 ఏళ్ల వయసున్న 892 మంది దక్షిణాసియా వాసుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధించి ఈ వివరాలు వెల్లడించారు.అలాగే శాకాహారం తీసుకునే పురుషుల్లో కరోనరీ ఆర్టరీ కాల్షియం అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు తేలింది. శాకాహారం గుండెకు రక్షణ ఇస్తుందా లేదా అని నిర్ణయించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని బృందం పేర్కొంది. -
శాకాహారం లేదని.. అలిగిన ఇషాంత్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కోపం వచ్చింది. రెండో టెస్టు మ్యాచ్ మూడోరోజు.. శుక్రవారం నాడు గాబాలో తమకు పెట్టిన భోజనంలో ఎక్కడా అసలు శాకాహారం అన్నదే కనిపించకపోవడంతో ఇషాంత్ అలిగి అక్కడినుంచి వెళ్లిపోయాడు. వాస్తవానికి గాబాకు వచ్చినప్పటి నుంచి కూడా భారతజట్టు తమకు చేసిన ఆహార ఏర్పాట్ల మీద తీవ్ర అసంతృప్తితో ఉంది. గ్లెనెల్గ్ ఓవల్ మైదానంలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల సందర్భంగా కూడా ఇలాగే ఆహార నాణ్యత నాసిగా ఉందని జట్టు సభ్యులు అన్నారు. అదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, హ్యూస్ మరణంతో విషాదంలో ఉన్న జట్టు మీద ఫిర్యాదు చేయడం ఎందుకని ఊరుకున్నారు. అడిలైడ్ టెస్టులో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని జట్టు సభ్యులు తెలిపారు. అక్కడ ఓ ఇండియన్ చెఫ్‌ను నియమించారు. కానీ బ్రిస్బేన్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా మారాయి. మీడియా రూంలో కూడా శాకాహారం కనిపించలేదు. దీనిగురించి ఇషాంత్ శర్మ, సురేష్ రైనా ఫిర్యాదు చేశారు. తర్వాత స్టేడియం వెలుపలకు వెళ్లి తమకు కావల్సిన ఆహారం కొనుక్కున్నారు. కానీ తిరిగి వస్తుంటే బయటి ఆహారం స్టేడియంలోకి తేకూడదని అడ్డగించారు. దాంతో బయట కూర్చుని శాకాహారం తిని.. తర్వాత లోపలకు వచ్చారు. -
చిట్‌చాట్: వెజ్జీ బుజ్జి
చిట్‌చాట్: శాకాహారమే బెటర్ అంటోంది నటి అదాశర్మ. తాను మొదటి నుంచీ వెజిటేరియన్నే అని చెబుతోంది ఈ అమ్మడు. ‘ నా ఫ్యాన్స్ కూడా శాకాహారులుగా మారితే సంతోషిస్తాను. శాకాహారంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను. మాంసాహారాన్ని కంప్లీట్‌గా వదిలేయాల’ని అదాశర్మ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం పెటా ఆధ్వర్యంలో శాకాహార ఆహారంపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అదాశర్మ నటించిన ప్రకటనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హిందీలో ఒక చిత్రం, తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నట్లు తెలిపారు.