ఇటీవల కాలంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. దీంతో అధిక బరువు పెరగడమే గాక ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడంతో శరీరంలో తొడలు,పిరుదులు, చేతులు భాగంలో కొవ్వు పెరిగిపోయి చూసేందుకు కూడా అసహ్యంగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వుతూ..శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ పాటించాలంటే అసాధ్యం. అందుకని ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహరంలో భాగం చేసుకుంటే సులభంగా కొవ్వు తగ్గించుకోవడమే కాదు బరువు కూడా తగ్గిపోతారు.
కొవ్వుని కరిగించుకోవాలనుకుంటే తీసుకోవాలసినవి..
సెనగలు
ఇవి స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్ చేస్తుంది.
క్వినోవా
డైట్ ప్లాన్‌లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్ ఉండదు.. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే.. శరీరానికి కావలసిన ప్రోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా అందుతుంది.
బాదం పప్పులు
వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది.
బాదం పప్పులు
వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది.
టోఫు:
ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి.
బ్రకోలీ:
దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి.
మొలకలు
వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment