స్నాక్స్‌ కోసం బెస్ట్‌ రెసిపి.. పోహా వెజ్‌ కట్‌లెట్‌ | How To Make Poha Veg Cutlet Recipe In Telugu | Sakshi
Sakshi News home page

స్నాక్స్‌ కోసం బెస్ట్‌ రెసిపి.. పోహా వెజ్‌ కట్‌లెట్‌

Published Wed, Nov 8 2023 4:44 PM | Last Updated on Wed, Nov 8 2023 4:44 PM

How To Make Poha Veg Cutlet Recipe In Telugu - Sakshi

పోహా వెజ్‌ కట్‌లెట్‌ తయారికి కావల్సినవి:

అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు;
క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్‌ తురుము – రెండు టీస్పూన్లు;
పచ్చిబఠాణి – రెండు టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు;
ధనియాల పొడి – టీస్పూను; చాట్‌ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను;
పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్‌ఫ్లోర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు;
బ్రెడ్‌ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.


తయారీ విధానమిలా:
అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙
► పచ్చిమిర్చి పేస్టు, చాట్‌ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్‌లెట్‌లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్‌ఫ్లోర్‌లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి.
► ఒక్కో కట్‌లెట్‌ను కార్న్‌ఫ్లోర్‌ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్‌ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్‌ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్‌ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్‌ కలర్‌లోకి మారాక తీసి సాస్‌ లేదా గ్రీన్‌ చట్నీతో సర్వ్‌ చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement