Poha veg cutlet
-
స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపి.. పోహా వెజ్ కట్లెట్
పోహా వెజ్ కట్లెట్ తయారికి కావల్సినవి: అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్ తురుము – రెండు టీస్పూన్లు; పచ్చిబఠాణి – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను; పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్‌ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙ ► పచ్చిమిర్చి పేస్టు, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్‌ఫ్లోర్‌లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ► ఒక్కో కట్లెట్ను కార్న్‌ఫ్లోర్ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్ కలర్లోకి మారాక తీసి సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ
ముంబై: కష్టపడే తత్వం ఉంటే ఏ పని చేసుకోనైనా బతికేయచ్చు.. కాళ్లు చేతులు అన్నీ సరిగా ఉన్నప్పటికీ కొంతమందికి పనిచేసుకోడానికి బద్ధకేసి భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. మరికొంత మందికి వేరే వాళ్ల మీద ఆధారపడి బతకడం నచ్చదు. తమ ఒట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. అచ్చం అలాగే ఆలోచించిన మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల వృద్ధ మహిళ బామ్మ కేవలం అయిదు రూపాయలకే స్నాక్స్ అమ్ముతూ పొట్ట పోషించుకుంటుంది. 5 రూపాయలకే ఆహారం అంటే నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. నాగ్‌పూర్‌లోని భారత్ మాతా చౌక్‌లోని టీబీ హాస్పిటల్ ముందు 65 ఏళ్ల బామ్మ కేవలం 5 రూపాయలకు తర్రి పోహాను విక్రయిస్తూ తన కాళ్ల మీద తను బతుకుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోహాను అమ్ముతూ బతుకు దెరువు సాగిస్తోంది. తన భర్త చనిపోవడంతో గత 15 ఏళ్లుగా పోహా విక్రయిస్తోంది. ఆమెకు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎవరూ లేదు. భార్య మరణంతో డబ్బు సంపాదించడానికి ఆమె ఏకైక మార్గం ఇదే. బామ్మ గురించి తెలిసిన అక్కడి స్థానికులు ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్ అయితే ఆమె కష్టాన్ని చూసిన ఓ ఫుడ్ వ్లాగర్ తన స్టోరీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. బామ్మకు సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్ధ మహిళను చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. కొంతమంది ఆమెకు ఏదైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల ఫుడ్ స్టాల్ బాగా నడిచేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చదవండి: బాప్రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!! View this post on Instagram A post shared by Dhir And Tauqeer (@food_o_logy_nagpur) -
పోహా తింటే బంగ్లాదేశీయులా!?
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు తినే ఆహారం బట్టి వారు ఏ దేశస్థులో ఇట్టే చెప్పవచ్చట! ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘మా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు తింటున్న ఆహారం చూసి నాకు వారి జాతీయత మీద అనుమానం వచ్చింది. వారంతా పోహా (అటుకుల ఉప్మా) తింటున్నారు. అది చూసి వారు బంగ్లాదేశ్ వాసులని నాకు అనుమానం వచ్చింది. రెండు రోజుల తర్వాత అదే విషయాన్ని వారిని నేను అడిగా. అంతే అప్పటి నుంచి వారు మా ఇంటి పనికి రావడం మానేశారు’ అని కైలాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాటిపై ఇప్పుడు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇండోర్‌లో ఇటీవలనే క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలసి జలేబీ, పోహా పసందుగా తింటూ కనిపించారు’ మొహమ్మద్ జుబేర్ వారి ఫొటోను షేర్ చేశారు. ‘మా పని మనిషి కేవలం న్యూఢిల్స్ మాత్రమే తింటుంది. బహూశ ఆమె చైనా దేశస్థురాలు కావచ్చు’ అని నిర్మలా థాయ్ హల్వే వాలి ట్వీట్ చేశారు. ‘మా చాకలి బర్గర్ తింటున్నాడు. వాడు అమెరికన్ కావచ్చు’ అని కాజోల్ శ్రీనివాసన్ స్పందించారు. ‘ఇటీవల మా ఇంటి నిర్మాణం పనుల కోసం వచ్చిన కూలీలు ఎవరు తిననిది తింటిన్నారు. వారు పేడ తింటున్నారు. వారు సంఘీస్ కావొచ్చు’ భక్త్స్ నైట్మేర్ ట్వీట్ చేశారు. ‘మొదట్లో ఆవు తినేవారంతా యాంటీ నేషనల్స్. ఇప్పుడు పోహా తినే వారంతా యాంటీ నేషనల్స్’ అని, ‘పోహా ఇప్పుడు యాంటీ నేషనల్’ అని అద్వైత్, ప్రవీణ్ శామ్యూల్‌లు స్పందించారు. పోహాను మధ్య భారత్‌లో, పశ్చిమ భారత్‌లో ఎక్కువగా తింటారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తింటారు. -
వెజ్ పోహా కట్లెట్
స్నాక్ సెంటర్ కావలసినవి: అటుకులు - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు - 2, నూనె - 1 కప్పు, జీలకర్ర - అర చెంచా, ఆవాలు - అర చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, మైదా పిండి - అర కప్పు, కారం - 1 చెంచా, పసుపు - పావు చెంచా, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, నిమ్మరసం - 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు - 2 చెంచాలు , ఉప్పు - తగినంత, చాట్ మసాలా - చిటికెడు తయారీ: అటుకులను 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నీటినంతా పిండేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె వేయాలి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత మైదా పిండి, అటుకులు, చిదిమిన బంగాళదుంప, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని కట్లెట్స్లాగా చేసుకోవాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి, వీటిని బాగా కాల్చుకోవాలి. అవన్ ఉన్నవాళ్లు బేక్ చేసుకోవచ్చు.