ముంబై: కష్టపడే తత్వం ఉంటే ఏ పని చేసుకోనైనా బతికేయచ్చు.. కాళ్లు చేతులు అన్నీ సరిగా ఉన్నప్పటికీ కొంతమందికి పనిచేసుకోడానికి బద్ధకేసి భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. మరికొంత మందికి వేరే వాళ్ల మీద ఆధారపడి బతకడం నచ్చదు. తమ ఒట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. అచ్చం అలాగే ఆలోచించిన మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల వృద్ధ మహిళ బామ్మ కేవలం అయిదు రూపాయలకే స్నాక్స్ అమ్ముతూ పొట్ట పోషించుకుంటుంది. 5 రూపాయలకే ఆహారం అంటే నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం.
నాగ్‌పూర్‌లోని భారత్ మాతా చౌక్‌లోని టీబీ హాస్పిటల్ ముందు 65 ఏళ్ల బామ్మ కేవలం 5 రూపాయలకు తర్రి పోహాను విక్రయిస్తూ తన కాళ్ల మీద తను బతుకుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోహాను అమ్ముతూ బతుకు దెరువు సాగిస్తోంది. తన భర్త చనిపోవడంతో గత 15 ఏళ్లుగా పోహా విక్రయిస్తోంది. ఆమెకు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎవరూ లేదు. భార్య మరణంతో డబ్బు సంపాదించడానికి ఆమె ఏకైక మార్గం ఇదే. బామ్మ గురించి తెలిసిన అక్కడి స్థానికులు ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్
అయితే ఆమె కష్టాన్ని చూసిన ఓ ఫుడ్ వ్లాగర్ తన స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ.. బామ్మకు సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్ధ మహిళను చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. కొంతమంది ఆమెకు ఏదైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల ఫుడ్ స్టాల్ బాగా నడిచేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
చదవండి: బాప్‌రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!!
Comments
Please login to add a commentAdd a comment