dadi
-
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్‌కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ
ముంబై: కష్టపడే తత్వం ఉంటే ఏ పని చేసుకోనైనా బతికేయచ్చు.. కాళ్లు చేతులు అన్నీ సరిగా ఉన్నప్పటికీ కొంతమందికి పనిచేసుకోడానికి బద్ధకేసి భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. మరికొంత మందికి వేరే వాళ్ల మీద ఆధారపడి బతకడం నచ్చదు. తమ ఒట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. అచ్చం అలాగే ఆలోచించిన మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల వృద్ధ మహిళ బామ్మ కేవలం అయిదు రూపాయలకే స్నాక్స్ అమ్ముతూ పొట్ట పోషించుకుంటుంది. 5 రూపాయలకే ఆహారం అంటే నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. నాగ్‌పూర్‌లోని భారత్ మాతా చౌక్‌లోని టీబీ హాస్పిటల్ ముందు 65 ఏళ్ల బామ్మ కేవలం 5 రూపాయలకు తర్రి పోహాను విక్రయిస్తూ తన కాళ్ల మీద తను బతుకుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోహాను అమ్ముతూ బతుకు దెరువు సాగిస్తోంది. తన భర్త చనిపోవడంతో గత 15 ఏళ్లుగా పోహా విక్రయిస్తోంది. ఆమెకు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎవరూ లేదు. భార్య మరణంతో డబ్బు సంపాదించడానికి ఆమె ఏకైక మార్గం ఇదే. బామ్మ గురించి తెలిసిన అక్కడి స్థానికులు ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్ అయితే ఆమె కష్టాన్ని చూసిన ఓ ఫుడ్ వ్లాగర్ తన స్టోరీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. బామ్మకు సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్ధ మహిళను చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. కొంతమంది ఆమెకు ఏదైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల ఫుడ్ స్టాల్ బాగా నడిచేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చదవండి: బాప్రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!! View this post on Instagram A post shared by Dhir And Tauqeer (@food_o_logy_nagpur) -
వైరల్: అదిరిపోయే స్టెప్పులతో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హడావిడీ చేస్తున్నాయి. ఏ కార్యక్రమం అయిన తమ డ్యాన్స్‌తోనే జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. పెళ్లికూతురు, పిల్లలు, ఆంటీలు, అంకుల్స్ ఇలా ఎవరికి వారే నెట్టింట్లో పాలపులారిటీని సంపాదిస్తున్నారు. అయితే యుక్త వయసులో ఉన్న యువకులు, యువతీలు హుషారుగా డ్యాన్స్ చేయడం తెలిసిందే. అదే వయసు మీదపడిన బామ్మలు సైతం అదే జోరులో కాలు కదిపితే ఎలా ఉంటుంది. ఆ మజానే వేరు కదా.. అచ్చం ఇలానే అనుకుంది ఓ బామ.. చదవండి: బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా.. ఇంకేముంది బాలీవుడ్ నటి మధురి దీక్షిత్ నటించిన దిల్ తో పాగల్ హై సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘కోయి లడ్కి హై’కు హుషారైన స్టెప్పులేసింది. 62 ఏళ్లలోనూ చిన్న పిల్లలా రెండు జడలు వేసుకొని లేత గులాబీ రంగు కుర్తా, తెలుపు పలాజో ధరించిన 62 ఏళ్ల రవి బాల శర్మ అనే బామ్మ ఎంతో ఉల్లాసంగా డాన్స్ చేసింది. అదిరిపోయే స్టెప్పులతో అచ్చం మాధురి దీక్షిత్‌ను దించేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూవ్స్ సంపాదించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘బామ్మకు బాల్యం తిరిగి వచ్చింది. నువ్వు సూపర్ బామ్మ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: వైరల్: ఆనంద్ మహీంద్రా ట్వీట్లో పొరపాటు.. ‘నేను అమ్మాయిని కాను’ View this post on Instagram A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma) -
ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో!
జైపూర్: ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి మనుషుల మాదిరిగానే, నోరులేని జీవాలకు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉదంతాలను తెలిపే అనేక సంఘటనలు చూసే ఉంటాం. తాజాగా, మరో భావోద్వేగానికి గురిచేసే సంఘటన ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. వివరాలు.. జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. దీనిలో భన్వ్రీ దేవి అనే 90 ఏళ్ల వృధ్దురాలు ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమైంది.. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఒక పెద్ద కొండెంగ (లగూన్) ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. మెల్లగా ఆవృద్ధురాలు ఉన్న మంచంపై ఎక్కి కూర్చుంది. కాసేపు అటూ ఇటూ చూసింది. అంతటితో ఆగకుండా ఆ ముసలావిడ పైన కూర్చొని ఆప్యాయంగా ముఖంపై నిమిరింది. మొదట ముసలావిడ కాస్త భయపడినట్లు కనిపించినా, కాసేపటకి ,కొండెంగ చూపిస్తున్న ప్రేమకు భావోద్వేగానికి లోనైంది. ఆ వృద్ధురాలి కడుపు పైన కూర్చుని మరొసారి ఆలింగనం చేసుకుంటూ.. తన ప్రేమను చూపించింది. దీంతో, కొండెంగను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని దాని వీపుపై ప్రేమతో నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ మెల్లగా మంచం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వావ్.. మనుషుల కన్నా నోరులేని జీవాలే మిన్న..’, ‘బామ్మ.. నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆమె ఆరోగ్యం బాగు చేయడానికే ఆ దేవుడే వచ్చాడు..’,‘పాపం.. కొండెంగ.. తన గుంపు నుంచి తప్పిపోయిందేమో..’, ‘ఆ ప్రేమను చూసి మా కళ్లలో నీళ్లు తిరిగాయి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ చదవండి: ట్రైన్లో అడవి పంది: భళే పరుగులు తీస్తుందే!! -
స్టేజీపై డ్యాన్స్‌తో రచ్చచేస్తున్న బామ్మ.. వైరల్
దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి దేశమంతా విలవిల్లాడుతోంది. కాగా, గత 15 నెలలుగా ప్రజలందరూ వైరస్ భయంతోనే గడుపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా.. ఏదైనా శుభకార్యాలకు హాజరవ్వాలన్నా తెగ భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో బామ్మ స్పానిష్ పాటపై స్టెప్పులేస్తూ తెగ రచ్చ చేస్తోంది. పాపిచు.. పాట లిరిక్స్ కు తగ్గట్టుగా హావభావాలను పండించింది. ఆమె ఎనర్జీ లెవల్స్ చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపడుతున్నారు. ఆమె హుషారుతనం అక్కడి వారిని కట్టి పడేస్తోంది. దీంతో అక్కడి వారంతా బామ్మ చుట్టూచేరి మరీ ఆమెను మరింత ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు వావ్... బామ్మ ఏంత బాగా డ్యాన్స్ చేస్తోంది.. బామ్మను చూసి డ్యాన్స్ నేర్చుకోవాల్సిందే.. మీ డ్యాన్స్‌కు హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ పాటను 2003లో పనామేనియన్ రాపర్ లోర్నా తొలిసారి విడుదల చేశాడు. ఇది అనేక దేశాలను ఓ ఊపు ఊపేసింది. స్పానిష్‌లో పాపిచులో అంటే మగవారికి ప్రియమైన అన్నపదంగా ఉపయోగిస్తారు. కాగా కరోనా నుంచి ఉపశమనం కోసం ఒక అంబులెన్స్ డ్రైవర్ పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. -
కిల్లర్ బామ్మ.. మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే
మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్ మాత్రమే అంటారు చాలా మంది. కలలు సాకారం చేసుకోవాలనుకువారు.. ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే వారు వయసును పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను మళ్లీ అందిపుచ్చుకుంటారు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకోరు. తమ మనసుకు నచ్చిన పని చేస్తూ.. సంతోషంగా ఉంటారు. ఇలాంటి వారికే త్వరగా గుర్తింపు దక్కుతుంది. ఇందుకు ఉదాహరణలు మన చుట్టు కొకొల్లలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా సోషల్ మీడియా ఓ బామ్మను ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చింది. 60 ఏళ్ల రవి బాల శర్మ అనే ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజనులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తన హవభావాలు, డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో అదరగొడుతున్నారు బామ్మ. ప్రస్తుతం ‘‘డ్యాన్సింగ్ దాదీ’’ పేరుతో ఈ బామ్మ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతియాజ్ అలీ, దిల్జిత్ దోసాంజ్ వంటి వారు బామ్మ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ అయ్యారు. ఈమె డ్యాన్స్ వీడియోలు చూసిన వారంతా ‘‘బామ్మ మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రవి బాలా శర్మ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే చాలు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని డ్యాన్స్ చేసేదాన్ని. కానీ దానిలో రాణించే అవకాశం లభించలేదు. ఇలా ఉండగానే వివాహం అయ్యింది. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో సరిపోయింది. దాంతో డ్యాన్స్ ప్రాక్టీస్ మూలన పడింది’’ అంటూ చెప్పుకొచ్చారు. ‘‘ఇలా ఉండగానే నా భర్త మరణించారు. ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాను. డిప్రెషన్లోకి వెళ్లాను. నన్ను మాములు మనిషిని చేయడం కోసం నా పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టమని బలవంతం చేశారు. నన్ను గొప్ప డ్యాన్సర్‌గా చూడాలని నా భర్త కోరుకునేవాడు. ఆయన కల నేరవేర్చడం కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చారు. ‘‘ఈ క్రమంలో నా సోదరి ఓ సారి నన్ను ఆడిషన్‌కి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. ఆశ్చర్యం చాలా మంది నన్ను ప్రశంసించారు. బాగా చేశానని మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుండేదాన్ని. ఓ వీడియోకు ఏకంగా ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు’’ అన్నారు. ‘‘నా కల నిజం అవుతుందని కానీ.. ఈ వయసులో ఇంత పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తానని కానీ నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ప్రోత్సాహిస్తున్నవారందరికి ధన్యవాదాలు. వయసు మీద పడిందని బాధ పడకండి. అది కేవలం ఓ నంబర్ మాత్రమే. కలలను సాకారం చేసుకోవడానికి వయసుతో పని లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు ఈ బామ్మ. చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి View this post on Instagram A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma) -
బన్నీ డాడీ అయ్యాడు
జీవితంలో మధురమైన అనుభూతులు ఎన్నో ఎదురవుతాయి. కానీ, కొన్ని అనుభూతులు ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన అనుభూతిలో ఉన్నారు అల్లు అర్జున్. ఆయన భార్య స్నేహ శుక్రవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ‘తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు’ అని అల్లు అర్జున్ తన ఫేస్బుక్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బర్త్ ప్లేస్ ఆస్పత్రిలో గురువారం రాత్రి 11 గంటల 55 నిమిషాలకు బిడ్డకు జన్మనిచ్చారు స్నేహా. కొత్త మెంబర్ రాకతో అల్లు కుటుంబం మొత్తం ఆనందంలో ఉంది. పైగా బన్నీ పుట్టినరోజు ఈ నెల 8న. సో.. ఇక నుంచి అల్లు కుటుంబంలో ప్రతి ఏడాదీ ఒకే వారంలో రెండు పండగలన్నమాట! -
'ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే లేదు'
-
మా ఇంట్లో నానమ్మే బాస్!
అందుకే మహిళా సాధికారత కోసం బిల్లు తెద్దాం: రాహుల్ భోపాల్: ‘మా ఇంట్లో నాన్న(రాజీవ్), బాబాయ్(సంజయ్) ఉండేవారు. అయితే ఇంటికి బాస్ మాత్రం నానమ్మే(ఇందిరాగాంధీ). ఇందులో అనుమానమే లేదు. ఆమే బాస్‌గా ఉండేవారు.. అందుకే మహిళా సాధికారత కోసం మహిళా బిల్లు తెద్దాం. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు సాధికారత కల్పించకపోతే భారత్ శక్తిమంతమైన దేశంగా అవతరించలేదు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారీలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం సోమవారమిక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 250 మంది మహిళలతో ముచ్చటించారు. మహిళల సాధికారత ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ‘మా ఇంట్లో దాదీనే(నానమ్మ) బాస్’ అని నవ్వుతూ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాల్సిన అవసరముందని, దానికి మోక్షం లభించకపోతే అన్ని రంగాల్లో మహిళలకు సాధికారత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ నిర్వహించిన ఈ సమావేశంలో సెక్స్ వర్కర్లు, హిజ్రాలు, సామాజిక కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు తమ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. కొందరు నిర్మొహమాటంగా ధరల పెరుగుదల, వంటగ్యాస్ సమస్యలను లేవనెత్తారు. వారి డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తామని రాహుల్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్న ఆయన ఈ సమావేశంలో ఏమన్నారంటే.. చట్టసభల్లో స్త్రీలకు33 శాతం కోటా ఇచ్చేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఉంది. దాన్ని అలాగే వదిలేయలేం. ఈ విషయంలో పార్టీలకూ బాధ్యత ఉంది. బిల్లుకు ఆమోదం లభిస్తుంది. వచ్చే ఐదు, పదేళ్లలో కాంగ్రెస్ మంత్రుల్లో సగం మంది స్త్రీలే ఉంటారు. దేశంలో మహిళలు ఇప్పటికీ అన్ని రకాలుగా హింసకు గురవుతుండడం బాధాకరం. మహిళలకు సాధికారత కల్పించడం పెద్ద పోరాటం లాంటిది. మనం పోరాడి గెలవాలి. మా పార్టీతోపాటు పార్లమెంటులో, ప్రభుత్వంలో మహిళలకు విస్తృత ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తాను. {పతి మహిళా దేశానికి ఆస్తి. నాయకత్వ పదవుల్లో అత్యధికం వారికి దక్కేలా కృషి చేస్తాను. శక్తిసామర్థ్యాల్లో స్త్రీపురుషుల మధ్య తేడా లేదు. మహిళలకు ఎలాంటి రక్షణా అవసరం లేదు. వారి హక్కులను వారికిస్తే వారిని వారే రక్షించుకుంటారు. -
కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలు: దాడి
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: దాడి వీరభద్రారావు ప్రసంగం