Dancing Dadi Grooves To SRK Madhuri Dixit Koi Ladki Hai Video Goes Viral - Sakshi
Sakshi News home page

Dancing Dadi: అదిరిపోయే స్టెప్పుల‌తో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ

Published Fri, Aug 27 2021 7:03 PM | Last Updated on Fri, Aug 27 2021 8:18 PM

Viral video: Dancing Dadi Grooves to Madhuri Dixit Koi Ladki Hai - Sakshi

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ హడావిడీ చేస్తున్నాయి. ఏ కార్యక్రమం అయిన తమ డ్యాన్స్‌తోనే జనాలను అట్రాక్ట్‌ చేస్తున్నారు. పెళ్లికూతురు, పిల్లలు, ఆంటీలు, అంకుల్స్‌ ఇలా ఎవరికి వారే నెట్టింట్లో పాలపులారిటీని సంపాదిస్తున్నారు. అయితే యుక్త వయసులో ఉన్న యువకులు, యువతీలు హుషారుగా డ్యాన్స్‌ చేయడం తెలిసిందే. అదే వయసు మీదపడిన బామ్మలు సైతం అదే జోరులో కాలు కదిపితే ఎలా ఉంటుంది. ఆ మజానే వేరు కదా.. అచ్చం ఇలానే అనుకుంది ఓ బామ..
చదవండి: బుల్లెట్టు బండి: సూపర్‌.. జూనియర్‌ సాయి పల్లవిలా..

ఇంకేముంది బాలీవుడ్‌ నటి మధురి దీక్షిత్‌ నటించిన దిల్‌ తో పాగల్‌ హై సినిమాలోని ఫేమస్‌ సాంగ్‌ ‘కోయి లడ్కి హై’కు హుషారైన స్టెప్పులేసింది. 62 ఏళ్లలోనూ చిన్న పిల్లలా రెండు జడలు వేసుకొని లేత గులాబీ రంగు కుర్తా, తెలుపు పలాజో ధరించిన 62 ఏళ్ల రవి బాల శర్మ అనే బామ్మ ఎంతో ఉల్లాసంగా డాన్స్‌ చేసింది. అదిరిపోయే స్టెప్పుల‌తో అచ్చం మాధురి దీక్షిత్‌ను దించేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో మిలియన్‌ వ్యూవ్స్‌ సంపాదించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘బామ్మకు బాల్యం తిరిగి వచ్చింది. నువ్వు సూపర్‌ బామ్మ’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: 
వైరల్‌: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌లో పొరపాటు.. ‘నేను అమ్మాయిని కాను’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement