ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.
‘మైనర్‌పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్ చేసింది.
ఆ వీడియోలో ఏముందంటే..
రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి. నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో. ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ.. జానీ మాస్టర్ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్ చేస్తున్నారు.
Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice
Pls do not use this interview now and mislead audience
This interview was taken way before 2020
Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024
Comments
Please login to add a commentAdd a comment