
నూడుల్ చికెన్ తయారీకి కావల్సినవి:
బోన్ లెస్ చికెన్ – అర కిలో (సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి)
నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించి, కాస్త చల్లార్చినవి)
గుడ్డు – 1,చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
కార్న్ పౌడర్ – పావు కప్పు+1 టేబుల్ స్పూన్
అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా – అర టేబుల్ స్పూన్ చొప్పున
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – పావు టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా చికెన్ ముక్కల్లో చిల్లీ సాస్, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, కారం, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, గుడ్డు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికించిన నూడుల్స్‌లో కార్న్ పౌడర్ వేసుకుని అటూ ఇటూ గరిటెతో కలిపి.. ఒక ప్లేట్‌లో కొన్ని నూడుల్స్ పరచుకుని.. ఒక్కో చికెన్ ముక్కను అందులో పెట్టి చుట్టుకోవాలి. పుల్ల గుచ్చి.. ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకుని, దోరగా వేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment