దానిమ్మ రైస్ కేక్ తయారీకి కావల్సినవి:
అన్నం – 2 కప్పులు
దానిమ్మ గింజలు – అర కప్పు పైనే
కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు
అరటి పండు గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు
పాలు – పావు లీటర్
పంచదార – 1 కప్పు
నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు
దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో పాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటి పండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాతరంగా ఒత్తుకుని.. గట్టిపడనివ్వాలి. వాటిపై దాల్చిన చెక్క పొడి, దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment