
కోకోనట్ ఓట్స్ కేక్ తయారీకి కావల్సినవి:
కొబ్బరి పాలు – పావు లీటర్, కొబ్బరి తురుము – 1 కప్పు
ఓట్స్ పౌడర్ – ఒకటిన్నర కప్పులు,బియ్యప్పిండి – పావు కప్పు
బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు
నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు, నీళ్లు – 2 కప్పులు
తయారీ విధానమిలా..
ముందుగా స్టవ్ ఆన్ చేసి.. పాత్రలో కొబ్బరిపాలు, పంచదార వేసి.. పంచదార కరిగేవరకూ తిప్పుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం గరిటె సాయంతో ఒక బౌల్‌లో ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్ వేసుకుని కొద్దికొద్దిగా కొబ్బరి పాల మిశ్రమాన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి.
ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, కొబ్బరి తురుము వేసి మరోసారి కలుపుకోవాలి. తర్వాత కేక్ తయారు చేసే పాత్రకు అడుగున నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమం వేసి.. ఓవెన్‌లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. అభిరుచిని బట్టి క్రీమ్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment