How To Make Tasty Baingan Bharta Recipe - Sakshi
Sakshi News home page

Baingan Bharta Recipe: రోటీస్‌లో మంచి సైడ్‌ డిష్‌ బైగాన్‌ బార్తా ఇలా చేసుకోండి..

Published Tue, Jul 18 2023 4:47 PM | Last Updated on Tue, Jul 18 2023 6:34 PM

How To Make Tasty Baingan Bharta Recipe - Sakshi

రోటీస్‌లో మంచి సైడ్‌ డిష్‌ బైగాన్‌ బార్తా ఇలా చేసుకోండి..

బైగన్‌ కా బార్తా తయారీకి కావల్సినవి:

మీడియం సైజు వంకాయలు – రెండు ; వెల్లుల్లి రెబ్బలు – నాలుగు ;
నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు ; వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ;
అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) ; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ;
ఉల్లిపాయ తరుగు – అరకప్పు ; కారం – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ;
 ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానమిలా..

  • వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి.
  • ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి.
  • ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి.
  • వంకాయ కాలిన తరువాత చల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి.
  • బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
  • కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి.
  • నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్‌ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్‌ డిష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement