
లవంగ్ లతిక తయారీకి కావల్సినవి:
మైదా – ముప్పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; పంచదార – కప్పు;
లవంగాలు – పన్నెండు; నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా.
స్టఫింగ్ కోసం: కోవా తురుము – ముప్పావు కప్పు; బాదం, పిస్తా,
జీడిపప్పు పలుకులు – అరకప్పు; వేడిపాలు – అరటీస్పూను;
కుంకుమ పువ్వు రేకులు – పావు టీస్పూను;
పంచదార పొడి – పావు టీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను.
తయారీ విధానమిలా:
మైదాలో టేబుల్ స్పూను నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙పంచదారలో ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి మీడియం మంట మీద తిప్పుతూ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ∙స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.నానిన పిండిముద్దను ఉండలుగా చుట్టుకోవాలి.
ఈ ఉండలను పూరీల్లా వత్తుకుని మధ్యలో రెండు రెండు టీస్పూన్ల స్టఫింగ్‌ను వేయాలి ∙ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా రెండు పక్కలా పూరీని మూయాలి పూరీని తిరగేసి తెరచి ఉన్న మరోవైపుని కొద్దిగా తడిచేసి మూసివేయాలి. మడత ఊడి΄ోకుండా లవంగం గుచ్చాలి ఇలా అన్ని లతికలను తయారు చేసుకోవాలి.
ఇప్పుడు సలల కాగుతోన్న నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి ∙చక్కగా వేగిన లతికలను టిష్యూపేపర్ మీద వేసుకోవాలి వీటిని తినాలనుకున్నప్పుడు పంచదార సిరప్‌ను వేడిచేసి దానిలో లతికలను వేసి పదిహేను నిమిషాలు ఉంచి, ఆ తరువాత సర్వ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment