
మండిగే తయారీకి కావల్సినవి:
బొంబాయి రవ్వ – రెండు కప్పులు; గోధుమ పిండి – కప్పు;
ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు – అరకప్పు;
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చకర్పూరం – చిటికెడు.
తయారీ విధానం ఇలా:
పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూను నెయ్యివేసి కలపాలి.
ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. దీనిపైన మూతపెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి.
బెల్లంలో మిగిలిన నెయ్యి, పచ్చకర్పూరం వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి
∙20 నిమిషాల తరువాత పిండిముద్దను ఉండలుగా చుట్టి, చపాతీలా వత్తుకోవాలి.
ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని,పైన రెండు టీస్పూన్ల బెల్లం మిశ్రమం వేసి చపాతీ అంతా పరచాలి.
బెల్లం పరిచిన చపాతీపై మరో చపాతీని వేసి చ΄ాతీకర్రతో ఒకసారి వత్తుకోవాలి.
ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద వేసి రెండు వైపులా క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి.
ఇలా కాలిన మండిగేను రెండు మూడు మడతలు వేసి సర్వ్ చేసుకోవాలి.