చాక్లెట్ ట్రఫెల్స్ తయారీకి కావల్సినవి:
బాదం పప్పు – కప్పు; ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; కర్జూరాలు – పదిహేను;
బాదం బటర్ – ము΄్పావు కప్పు; డార్క్ చాక్లెట్ ముక్కలు – పావు కప్పు; కొబ్బరి నూనె – అరటీస్పూను;
బరకగా దంచిన పిస్తా పలుకులు – పావు కప్పు; బాదం పలుకులు – పావు కప్పు;
నల్లని పొరతీసి తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు; స్ట్రాబెరీ పొడి – పావు కప్పు.
తయారీ విధానమిలా:
►కర్జూరాలను ఒకసారి కడిగి పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి ∙బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించి మిక్సీజార్‌లో వేయాలి.
► నానబెట్టిన కర్జూరాలను నీరు లేకుండా తీసి మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి ∙సగం నలిగిన మిశ్రమంలో బాదం బటర్ వేసి గ్రైండ్ చేయాలి.
► అవసరాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙ఇప్పుడు గ్రైండ్ అయిన మిశ్రమాన్ని బయటకు తీసిన నచ్చిన పరిమాణంలో లడ్డుల్లా చుట్టుకోవాలి.
► బాదం, పిస్తా పలుకులను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙చాక్లెట్‌ముక్కల్లో కొబ్బరి నూనెవేసి అవెన్‌లో 45 సెకన్లు ఉంచాలి. చాక్లెట్ కరిగిన తరువాత పక్కన పెట్టుకోవాలి.
► ఇప్పుడు ముందుగా చేసుకున్న లడ్డులాను ఒక్కోక్కటి ఎండుకొబ్బరి తురుము, పిస్తా, బాదం, స్ట్రాబెరీ పొడులు, చాక్లెట్ మిశ్రమంలో ముంచి అద్దుకుంటే ట్రఫెల్స్ రెడీ. రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసుకుంటే ఇవి పదిరోజుల పాటు తాజాగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment