
ఊదల కుకీస్ తయారీకి కావల్సినవి:
మైదా – 1 కప్పు, ఊదల పిండి – ఒకటిన్నర కప్పులు, బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు
సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ – 100 గ్రా. చొప్పున
చిక్కటి పాలు – కొద్దిగా, చాక్లెట్ క్రీమ్ – 1 కప్పు (చిప్స్ లేదా బిట్స్‌ని ఓవెన్‌లో కరిగించి పెట్టుకోవాలి)
తయారీ విధానమిలా:
మొదట పెద్ద బౌల్ తీసుకుని పటికబెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. అందులో సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్‌తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఊదల పిండి, బాదం పప్పు పొడి వేసుకుని చేత్తో ముద్దలా కలపాలి. అవసరాన్ని బట్టి.. సరిపడా గోరు వెచ్చని పాలు పోసి కలుపుకోవచ్చు. దీన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
ఆ తర్వాత చేత్తో బిస్కట్స్‌లా ఒత్తుకుని, ప్రీ హీట్ చేసిన ఓవెన్‌లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 లేదా 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అనంతరం... కరిగిన చాక్లెట్ క్రీమ్‌లో ముంచి తీసి, పైన చాక్లెట్ కోన్ సాయంతో నచ్చిన షేప్‌లో డిజైన్స్ వేసుకుని.. కాసేపు ఆరనిచ్చి సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment