
బీట్‌రూట్ – మిల్క్ సందేశ్ తయారీకి కావల్సినవి:
బీట్‌రూట్ – 2 (ముక్కలు కట్ చేసుకుని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి)
పాల పొడి – పావు కప్పు
నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
పంచదార పొడి – ముప్పావు కప్పు
తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ మంటను సిమ్‌లో పెట్టుకుని.. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో బీట్‌రూట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో పాలపొడి, పంచదార పొడి వేసుకుని.. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాలకొకసారి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ దగ్గర పడేదాకా అలానే ఉండికించాలి. దగ్గర పడిన తర్వాత ఒక పాత్రకు నెయ్యి రాసి.. దానిలో వేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా తీసుకుంటూ.. వాటిని నచ్చిన షేప్‌లోకి మలిచి సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment