
గ్రేడ్ సిలికాన్ బాడీతో స్టెయిన్ లెస్ స్టీల్ బాటమ్‌తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. గ్యాస్ స్టవ్ మీదైనా, ఇండక్షన్ స్టవ్ మీదైనా చక్కగా పని చేస్తుంది. దీని సామర్థ్యం సుమారుగా రెండు లీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఫోల్డ్ చేస్తే చిత్రంలో ఉన్న విధంగా చాలా చిన్నగా మారిపోతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.
అలాగే.. హీట్ ఇన్సులేషన్ హ్యాండిల్, యాంటీ–స్కాల్డ్ లిడ్‌తో క్యాంపింగ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇందులో 3 నుంచి 5 నిమిషాలలో ఓట్ మీల్ లేదా కాఫీ లేదా టీ వంటివి తయారు చేసుకోవచ్చు. గుడ్లు, జొన్నకండెలు, చికెన్, మటన్, కూరగాయలు ఇలా వెజ్, నాన్‌వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ కెటిల్ ధర 194 డాలర్లు (రూ.15,972).
Comments
Please login to add a commentAdd a comment