కేవలం 15 నిమిషాల్లో గ్రీన్‌ కేక్‌ మిక్స్‌ కుకీస్‌ రెడీ | Green Cake Mix Cookies Recipe In Telugu | Sakshi
Sakshi News home page

కేవలం 15 నిమిషాల్లో గ్రీన్‌ కేక్‌ మిక్స్‌ కుకీస్‌ రెడీ

Published Thu, Dec 21 2023 4:58 PM | Last Updated on Thu, Dec 21 2023 5:01 PM

Green Cake Mix Cookies Recipe In Telugu - Sakshi

గ్రీన్‌ కేక్‌ మిక్స్‌ కుకీస్‌ తయారీకి కావల్సినవి:

 వెనీలా కేక్‌ మిక్స్‌ – మూడు కప్పులు; నూనె – ముప్పావు కప్పు;
గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్‌ – అరటీస్పూను;
గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ – టీస్పూను(జెల్‌); పంచదార పొడి – ముప్పావు కప్పు;
హార్ట్‌ షేప్‌ క్యాండీస్‌ – గార్నిష్‌కు సరిపడా.

తయారీ విధానమిలా:
కేక్‌ మిక్స్,నూనె, గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్‌ను, గ్రీన్‌ఫుడ్‌ కలర్‌ను ఒక గిన్నెలో వేసి ముద్దలా కలపాలి. తరువాత రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి ∙ఇరవై నిమిషాల తరువాత పిండి ముద్దను బయటకు తీసి స్కూప్‌ పరిమాణంలో పిండిని తీసుకుని ఉండలు చేయాలి.

ఈ ఉండలను పంచదార పొడిలో ముంచి కోటింగ్‌లా అద్దాలి.తరువాత ఉండలను బేకింగ్‌ ట్రేలో పెట్టి, కుకీ షేప్‌ వచ్చేలా వత్తుకోవాలి ∙కుకీ మధ్యలో హార్ట్‌ ఆకారంలో ఉన్న క్యాండీని పెట్టి బేకింగ్‌ ట్రేని అవెన్‌లో పెట్టాలి ∙350 డిగ్రీల ఫారిన్‌ హీట్స్‌ వద్ద పదిహేను నిమిషాలు బేక్‌ చేస్తే గ్రీన్‌ కేక్‌ మిక్స్‌ కుకీస్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement