
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి:
చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు;
మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు;
పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను;
ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు.
తయారీ విధానమిలా:
►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి.
► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి.
► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్‌లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment