ఎగ్ బాదం బర్ఫీ తయారీకి కావల్సినవి:
గుడ్లు – 7, పంచదార, కోవా – 250 గ్రాముల చొప్పున, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు , బటర్ – 4 టేబుల్ స్పూన్లు (కరిగించాలి), బాదం – 40 పైనే (మిక్సీలో పొడి చేసుకోవాలి), నెయ్యి – కొద్దిగా
తయారీ విధానమిలా: ముందుగా గుడ్లను మిక్సీలో పగలగొట్టి వేసుకుని.. బాగా మిక్సీ పట్టుకోవాలి.అందులో పంచదార, కోవా, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, కరిగించిన బటర్, బాదం పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి.
అనంతరం బౌల్ తీసుకుని.. దాని అడుగున బాగా నెయ్యి రాసి.. గుడ్లు–పంచదార మిశ్రమం వేసుకుని.. ఓవెన్‌లో పెట్టుకోవాలి. సుమారు 170 డిగ్రీల సెల్సియస్‌లో 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని మీ అభిరుచిని బట్టి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment