Do You Know Interesting Things About Pizza Maker - Sakshi
Sakshi News home page

Pizza Maker: వెకేషన్‌లో పిజ్జా తినాలనుందా? ఈ మేకర్‌ ఉండాల్సిందే

Published Tue, Jul 25 2023 3:35 PM | Last Updated on Thu, Jul 27 2023 4:35 PM

Do You Know Intresting Things About Pizza Maker - Sakshi

ఎన్ని రుచులున్నా పిజ్జా రుచి దేనికీ రాదంటుంటారు పిజ్జా లవర్స్‌. రకరకాల ఇన్‌గ్రీడియెంట్స్‌తో నచ్చిన విధంగా పిజ్జాలు చేసుకోవాలన్నా.. టూర్స్‌లో కూడా ఓన్‌ ఫ్లేవర్‌ పిజ్జా తినాలన్నా.. ఇలాంటి మేకర్‌ వెంట ఉండాల్సిందే. దీన్ని సులభంగా ఆరుబయటనైనా, ఇంటి బాల్కనీలోనైనా పెట్టుకోవచ్చు. ఏ పార్కులోనో, ఏ రివర్‌ సైడ్‌ ఖాళీ స్థలంలోనో.. స్నేహితులతో కానీ బంధువులతో కానీ బాతాఖానీ కొడుతూ చక్కగా ఇందులో నచ్చిన పిజ్జాలను తయారు చేసుకోవచ్చు.

దీన్ని క్యాంపింగ్‌కి వెంట తీసుకెళ్లొచ్చు. కుడివైపు ఆప్షన్స్‌తో పాటు రెగ్యులేటర్స్‌ ఉంటాయి. దానికే గ్యాస్‌ కరెక్టర్‌ అమర్చి ఉంటుంది. పిజ్జా కటర్, పిజ్జా పీల్, పిజ్జా మెనూ బుక్‌ వంటివి మెషిన్‌తో పాటు లభిస్తాయి. డివైస్‌ కింద అటోమేటిక్‌ రోటరింగ్‌ సిస్టమ్‌ బాక్స్‌ అటాచ్‌ అయ్యి ఉంటుంది.

డివైస్‌కి ఇరువైపులా అవసరమైన ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకునేందుకు.. కొద్దిగా ప్లేస్‌ ఉంటుంది. ఇక మెషిన్‌ ఆన్‌లో ఉన్నప్పుడు, లోపలుండే పిజ్జా స్టోర్‌ 360 డిగ్రీలు తిరుగుతూ బేక్‌ అవుతుంది. ఈ పిజ్జా మేకర్‌ ధర 299 డాలర్లు (రూ.24,605) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement