
పిజ్జాను ఎవరైనా ఇష్టపడాల్సిందే. తాజా కూరగాయ ముక్కలు పరచుకుని, మసాలా పొడులు జల్లుకుని, సాస్, చీజ్‌లతో గార్నిష్ చేసుకుని.. బేక్ చేసుకుని తింటే తస్సదియా అదిరిపోతుంది అంటుంటారు పిజ్జా లవర్స్. ప్రతి ఇంట ఇలాంటి డివైస్ ఒకటుంటే చాలు.. కోరుకునే పిజ్జా రుచులను నిమిషాల్లో ఆరగించొచ్చు. చిత్రంలోని ఈ డివైస్.. థర్మోస్టాట్ ఉన్న ఎలక్ట్రిక్ పిజ్జా ఓవెన్ అని చెప్పుకోవాలి.
దీని హీటింగ్ ఎలిమెంట్ 1200 వాట్ల వరకు శక్తిని కలిగి ఉంటుంది. దీనిలోని ఫైర్‌ప్రూఫ్ స్టోన్ బేస్.. పిజ్జాను సమానంగా బేక్ చేయడానికి సహకరిస్తుంది. ఇందులో పిజ్జాలతో పాటు కేకులు, బేకింగ్ ఐటమ్స్, టోస్ట్ ఐటమ్స్ ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు. అయితే గోపురం ఆకారపు క్రోమ్ పూతతో కూడిన స్టీల్ మూత లోపల వేడిని పెంచి, వేగంగా బేక్ అయ్యేలా చేస్తుంది. దీని అటాచ్డ్ మూతపైన ఉన్న ట్రాన్స్‌పరెంట్ గ్లాస్.. లోపలున్న ఆహారాన్ని చూపించడానికి యూజ్ అవుతుంది. దాంతో దీనిలో కుకుంగ్ ఈజీ అవుతుంది. ధర 90 డాలర్లు (రూ.7,496) .
Comments
Please login to add a commentAdd a comment