![Rana Daggubati Clarity on His wife Miheeka Bajaj pregnancy rumours - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/21/rana.gif.webp?itok=4U1plLMz)
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మిహికా షేర్‌చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రాకముందే మిహికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో వైరలయ్యాయి. ఇటీవలే ఆమె ఓ పాపను ఎత్తుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో పలువురు అభినందనలు కూడా తెలిపారు. అయితే తాజాగా నటుడు దగ్గుబాటి రానా తాజాగా స్పందించారు.
(చదవండి: మిహికా ఇన్‌స్టా పోస్ట్ వైరల్ .. రానా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!)
గాయని కనికా కపూర్ సైతం ఈ జంటకు అభినందనలు తెలపడంంతో తాజాగా రానా క్లారిటీ ఇచ్చారు. తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని అన్నారు. తన భార్య మిహీకా గర్భవతి కాదని స్పష్టం చేశారు. దీంతో నెట్టింట్లో హల్‌చల్ రూమర్లకు ముగింపు పలికారు. టాలీవుడ్‌లోని ఆరాధ్య జంటలలో ఒకరైన రానా, మిహీకా ఆగస్టు 8, 2020న వివాహం చేసుకున్నారు. పెళ్లయాక రానా, మిహీక సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తున్నారు. రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment