పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham Movie). డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్‌ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్ సన్నివేశంలో మొసలితో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.
కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
So happy to present the first look of @ViratKarrna from #Nagabandham.
Already feels like an exhilarating ride :)
Best wishes to my dearest #AbhishekNama garu, @nikstudiosindia and the entire team!!!@AbhishekPicture #KishoreAnnapureddy@ViratKarrna @NabhaNatesh @Ishmenon… pic.twitter.com/GXSSNYdlcg— Rana Daggubati (@RanaDaggubati) January 13, 2025
Comments
Please login to add a commentAdd a comment