'నేనిక్కడే ఉంటానురా.. ఎక్కడికెళ్లను .. రమ్మను'.. అదిరిపోయిన గ్లింప్స్ | Victory Venkatesh Latest Movie Saindhav to be made in multiple languages, Glimpse Out | Sakshi
Sakshi News home page

Saindhav Movie: వెంకటేశ్ లేటెస్ట్ మూవీ 'సైంధవ్'.. అదిరిపోయిన గ్లింప్స్

Published Wed, Jan 25 2023 4:04 PM | Last Updated on Wed, Jan 25 2023 4:10 PM

Victory Venkatesh Latest Movie Saindhav to be made in multiple languages, Glimpse Out - Sakshi

విక్టరీ వెంకటేశ్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. హిట్‌ సినిమా దర్శకుడు  శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న మూవీకి సైంధవ్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అంతే కాకుండా వెంకటేశ్ ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. దీంతో విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్  బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియా భాషలతో పాటు హీందీలోనూ నిర్మిస్తున్నారు. 'నేనిక్కడే ఉంటానురా.. ఎక్కడికెళ్లను .. రమ్మను' అనే డైలాగ్ వెంకీ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. 

ఇవాళ విడుదలైన టైటిల్ పోస్టర్ చూస్తే పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ను తలపిస్తోంది. టైటిల్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. టైటిల్ పోస్టర్‌లో యాక్షన్‌ సీన్ల్ భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. వీడియోకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. వెంకటేశ్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్. ఈ సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement