
ఇటీవల దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే రానా భార్య మిహికా మేనకోడలును ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో అభిమానులు మిహికా ప్రెగ్నెంట్ అని భావించారు. కొందరైతే ఏకంగా సోషల్ మీడియాలో అభినందనలు కూడా తెలిపారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రూమర్లపై రానా క్లారిటీ ఇవ్వడంతో వాటికి తెరపడింది.
రానా భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా భర్త రానాతో ఉన్న ఓ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. రానాను ప్రశంసిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మిహికా. మిహికాను రానా తన చేతుల్లో పట్టుకుని సంతోషంగా చిరునవ్వుతో ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది.
మిహికా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రాస్తూ.. 'నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన మీకు అభినందనలు. మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆ విషయాల్లో తప్పకుండా మీరు కూడా ఒకరుగా ఉంటారు.' అంటూ రానాను ప్రశంసలతో ముంచెత్తింది. పోస్ట్ చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment