
Rhea Chakraborty Said She Learnt How To Live In Present: బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సాధారణ స్థితికి రావడానికి ఒక్కో అడుగు వేస్తోంది. 2020 సంవత్సరంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ల వయసులో మరణించడంతో రియా పలు ఆరోపణలు ఎదుర్కొంది. సుశాంత్ మరణించిన సుమారు రెండేళ్ల తర్వాత ప్రియుడు జ్ఞాపకాలనుంచి బయటకు వచ్చేందుక ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ షిబానీ దండేకర్ వివాహానికి హాజరైంది. ఈ పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమంలో దిగిన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ ఫొటోలో రియా ఎల్లో లెహెంగాలో అందంగా కనిపించింది. ఈ ఫొటో షేర్ చేస్తూ 'ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట.. చివరికీ ఆమె ఎలా జీవించాలోనేర్చుకుంది.' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది రియా. ఇక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో సుశాంత్, రియా అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంతో అందంగా ఉన్నావ్ అని ఒకరు, లవ్లీ అంటూ మరొకరు రియాను పొగుడుతున్నారు. కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం సుశాంత్ మరణాన్ని గుర్తు చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment