నిహారిక పోస్ట్‌: కాబోయే భర్త అతనేనా? | Niharika Marriage: Niharika shared Her Wood be Pic on Instagram | Sakshi
Sakshi News home page

కాబోయే భర్త ఫోటో షేర్‌ చేసిన నిహారిక!

Jun 18 2020 7:24 PM | Updated on Jun 18 2020 9:02 PM

Niharika Marriage: Niharika shared Her Wood be Pic on Instagram - Sakshi

కొణెదల నిహారిక... మెగా వారసురాలిగా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ మధ్య సినిమాల కంటే ఆమె పెళ్లిపై వచ్చే గాసిప్స్‌ ద్వారానే నిహారిక ఇంకా ఫేమస్‌ అయ్యారు. అయితే నిహారిక పెళ్లి త్వరలోనే చేయబోతున్నామని మెగా బ్రదర్‌ నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి చేయబోతున్నట్లు  తెలిపారు. ఈ వార్త నిజమేననట్లు నిహారిక ఒక కప్పుపై మిస్‌ నిహారిక అని పేరును కొట్టేసి, మిసెస్‌ అని రాసి కొశ్చన్‌ మార్క్‌ పెట్టింది. దీంతో పెళ్లి నిజంగానే ఫిక్స్‌ అయ్యిందని అందరూ భావిస్తున్నారు. (నిహారిక పోస్ట్‌: పెళ్లి గురించేనా?) 



అయితే ఈ రోజు (గురువారం) తాజాగా ఒక వ్యక్తిని హగ్‌ చేసుకొని ఉన్న ఫోటోను నిహారిక తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో అందరూ నిజంగా నిహారిక పెళ్లిని పెద్దలు నిశ్చయించేశారని అనుకుంటున్నారు. అయితే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది మాత్రం ముఖం కనిపించడం లేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అతనే నిహారికకు కాబోయే భర్త అని భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్‌తో, ఇతర హీరోలతో నిహారిక పెళ్లి అని అనేక గాసిప్‌లు సృష్టించారు. అయితే ప్రస్తుతం నిహారిక గుంటూరుకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడు చైతన్యను చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్త ఎంతవరకు నిజమో కొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. (మెగా డాటర్‌ ఆవకాయ పచ్చడి.. నోరు ఊరిపోవాల్సిందే)

Peek-a-boo

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement