వధువుగా నిహారిక.. ఫోటో వైరల్‌ | Niharika Konidela Bridal look Goes Viral | Sakshi
Sakshi News home page

వధువుగా నిహారిక.. ఫోటో వైరల్‌

Published Wed, Dec 9 2020 6:43 PM | Last Updated on Thu, Dec 10 2020 5:41 AM

Niharika Konidela Bridal look Goes Viral - Sakshi

మెగా బ్రదర్‌, నటుడు నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్లికుమార్తెగా ముస్తాబయ్యారు. మెరూన్‌ కలర్‌ చీరకు ఆకుపచ్చ రంగు బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసి సంప్రదాయ వస్త్రధారణలో అందంగా మెరిసిపోతున్నారు. చీరకు తగ్గ ఆభరణాలు ధరించిన నిహారిక ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ‘‘కొణిదెల వారి ముద్దుల తనయ నేటితో జొన్నలగడ్డ ఇంటి కోడలు కాబోతుంది. ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు’’ అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈరోజు రాత్రి 7.15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో జరుగనున్న వీరి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు.

పెళ్లికి కొన్ని గంటల ముందు  నిహారికకు సంబంధించిన ఫోటోను కాబోయే భర్త చైతన్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో నిహారిక పెళ్లి కుమారుడికి సంబంధించిన వస్త్రాలను పట్టుకొని ఉండగా, దానిపై ‘నా వధువు సిద్ధంగా ఉంది’ అని రాసి ఉంది. నిహారిక చేతిలో చేయి వేసి ఏడడుగులు నడిచేందుకు చైతన్య ఎంత ఉత్సహంగా ఉన్నాడో ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది.

(పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(నిహారిక మెహందీ ఫంక్షన్‌ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఘనంగా నిహారిక-చైతన్యల సంగీత్ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement