Niharika Marriage: Niharika Konedhela Haldhi Cermony Video | Pre Wedding Celebrations Of Niharika and Chaitanya - Sakshi
Sakshi News home page

నిహారిక హల్దీ వేడుక: వీడియో వైరల్‌

Published Wed, Dec 9 2020 2:53 PM | Last Updated on Thu, Dec 10 2020 2:58 AM

Viral: Niharika Haldi Ceremony Took Place Today In Udaypur - Sakshi

మెగా బ్రదర్, నటుడు నాగబాబు ముద్దుల కుమార్తె కొణిదెల నిహారిక మరికొన్ని గంటల్లో జొన్నలగడ్డ నిహారికగా మారనున్నారు. ఈ రోజు రాత్రి 7.15 నిమిషాలకు గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. రాజస్తాన్‌ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయ్‌పూర్‌కు చేరుకొని ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న పవన్‌ కల్యాణ్‌ కూడా కొడుకు అకిరా నందన్‌తో కలిసి ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలు అందరూ సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా కనిపించే హీరోలంతా ఒక్కచోట చేరడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. చదవండి: నిహారిక మెహందీ.. చిరు, బన్నీ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా నేడు మెహందీ, హల్దీ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధువరులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకలకు చెందిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటితో పాటు హైదరాబాద్‌లోని నివాసంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోను నాగబాబు తన య్యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌చేశారు. ఇదిలా ఉండగా సోమవారం నాటి సంగీత్‌ కార్యక్రమంలో వధూవరులు, మెగా హీరోలు డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లోనూ ఆ జోష్‌ కొనసాగించారు. ఇక మెహందీ ఫంక్షన్‌ సందర్భంగా మెగాస్టార్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకు చిరు, అల్లు అర్జున్‌ల స్టెప్పులు వేశారు. అదే పాటకు చిరు భార్య సురేఖ, అల్లు అరవింద్‌ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చదవండి: నిహారిక మెహందీ.. పవన్‌ కళ్యాణ్‌ సందడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement