దుబాయ్: ఐపీఎల్ లక్షలాది మంది అభిమానుల నిరీక్షణకు తెరదించింది. 436 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎస్ ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని, గతం కంటే భిన్నంగా ఫిట్‌గా కనిపించాడు. ఆయన ఫిట్‌నెస్, హెయిర్ స్టైల్ సరికొత్తగా కనిపించాయి. అయితే.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచిన తర్వాత ధోని భార్య సాక్షిసింగ్.. ధోని చేతిలో మైక్ ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో 'ఎంత అందంగా ఉన్నాడో' అంటూ రాసుకొచ్చింది. (సింగం స్టైల్‌లో.. ధోని న్యూలుక్)
సీఎస్‌కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తరువాత.. లాక్‌డౌన్‌లో క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారంటూ ధోనిని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అడిగాడు. సమాధానంగా లాక్‌డౌన్‌లో స్వేచ్చగా, ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోనే గడిపినట్లు చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నందుకు మిగతా టీమ్ సభ్యులను కూడా అభినందించారు. (ముంబైపై విజయంతో ధోని కొత్త చరిత్ర)
ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనికి ఇదే మొదటి మ్యాచ్. అయితే ధోనికి ఈ మ్యాచ్‌లో పెద్దగా బ్యాట్‌తో పనిచెప్పే అవసరం రాకపోయినప్పటికీ, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్‌లో చాలా పదునుగా కనిపించాడు. అయితే, సెప్టెంబర్ 22న షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌లో తన నుంచి ఓ భారీ ఇన్సింగ్స్‌ను సీఎస్‌కే అభిమానులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment