నా శరీరం బాగుంది.. అందుకే: నటి | Actress Charu Asopa Give Counter To Trolls For Her Dressing | Sakshi
Sakshi News home page

ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్‌ నటి

Published Thu, Jun 4 2020 2:05 PM | Last Updated on Thu, Jun 4 2020 5:07 PM

Actress Charu Asopa Give Counter To Trolls For Her Dressing - Sakshi

ముంబై : బాలీవుడ్‌ బుల్లితెర నటి చారు అసోపా చేసిన ఓ కామెంట్‌‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. గతేడాది జూన్‌లో మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ను సేన్‌ను చారు అసోపా వివాహం చేసుకున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న చారు తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాను ఎంతగానో ఇష్టపడే రెడ్‌ కలర్‌ క్రాప్‌ జాకెట్‌ ధరించి ఇంట్లో ఫోటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేగాక ఈ డ్రెస్‌తో బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేసి దానిని కూడా అభిమానులతో పంచుకున్నారు. (పుత్రోత్సాహంలో బాలీవుడ్‌ హీరో)

ఇక చారు పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చారు రెడ్‌ దుస్తుల్లో అదిరిపోయారంటూ అభిమానులు పొగుడుతూంటే మరికొంతమంది ఆమె డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌ చేస్తున్నారు. వేషాధారణ సరిగా లేదని ఇలాంటి దుస్తులు ధరించడానికి సిగ్గు లేదా అని మండిపడుతున్నారు. శోభ అనే నెటిజన్‌ ఏకంగా.. ‘‘ఆ మాత్రం ఆచ్ఛాదన ఎందుకు’’ అంటూ అసభ్యకర కామెంట్‌ చేశారు. అయితే ఈ కామెంట్లపై చారు ఘాటుగా స్పందించారు. ‘నా శరీరం బాగుంది కాబట్టి నేను దానిని చూపించాలనుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఉంటే మీరు కూడా చూపించవచ్చు’. అంటూ విమర్శలను తిప్పికొట్టారు. చూసే కళ్లను బట్టే ఎదుటివారిపై అభిప్రాయం మారుతుందని పేర్కొన్నారు. కాగా మహాదేవ్‌, దియా ఔర్‌ బాతి హమ్‌, మేరే ఆంగ్నే మెయిన్‌, మహారక్షక్‌ వంటి టీవీ షోలలో నటించి మంచి పేరును సంపాదించారు. అలాగే కాల్‌ ఫర్‌ ఫన్‌, ఇంపేషెంట్‌ వివేక్‌ వంటి సినిమాల్లోనూ చారు నటించారు. (బాలీవుడ్‌ యువ కాస్టింగ్‌ డైరెక్టర్‌ మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement