David Warner Shares Picture In CSK Jersey Ahead Of IPL 2021 Final - Sakshi
Sakshi News home page

IPL 2021 Final: సీఎస్‌కే జెర్సీలో వార్నర్‌.. అసలేం జరిగింది..?

Published Fri, Oct 15 2021 5:09 PM | Last Updated on Fri, Oct 15 2021 5:47 PM

IPL 2021 Final: David Warner Shares Pic In CSK Jersey - Sakshi

courtesy: david warner instagram

David Warner Shares Pic In CSK Jersey Ahead Of IPL 2021 Final: చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మరికాసేపట్లో మొదలుకానున్న ఐపీఎల్‌-2021 తుది పోరు నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ సారధి, ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. ఇందులో వార్నర్‌ సీఎస్‌కే జెర్సీ ధరించి తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని దర్శనమిచ్చాడు. సీఎస్‌కే, కేకేఆర్‌ జట్ల మధ్య జరిగే నేటి ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేను కానీ.. ఓ అభిమాని కోరికను కాదనలేక ఈ పోస్ట్‌ను చేస్తున్నానంటూ క్యాప్షన్‌ జోడించాడు.

అయితే, ఈ పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాలకే వార్నర్‌ దీన్ని తొలగించడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వార్నర్‌ నేటి మ్యాచ్‌ వరకే సీఎస్‌కే అభిమానిగా ఉంటాడా లేక వచ్చే సీజన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్‌కే జట్టుకు వెళ్లిపోతాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో వరుస వైఫల్యాల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 సీజన్‌ తొలిదశలో వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీని న్యూజిలాండ్‌ స్కిప్పర్‌ కేన్‌ విలియమ్సన్‌కు కోల్పోయాడు. 
చదవండి: టీ20 క్రికెట్‌కు అశ్విన్‌ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement