
హైదరాబాద్ : టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్, మెగా హీరో అల్లు అర్జున్. అంతేకాదండోయ్.. టాలీవుడ్‌లో స్టైలిష్ జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరి వ్యక్తిగత జీవితానికి, సినిమాలకు సంబంధించిన విషయాలను నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బన్నీ తన భార్య గురించి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
‘ఓఎంజీ (ఓ మై గాడ్)! నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా’అంటూ భార్య స్నేహారెడ్డి అందంపై బన్నీ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గోదుమ రంగులో ఉన్న సల్వార్ కమీజ్‌ను ధరించిన తన భార్యను ప్రముఖ స్టైలిస్ట్ హర్మన్ కౌర్ చాలా అందంగా ముస్తాబు చేశారని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. బన్నీ పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, స్నేహారెడ్డి చాలా అందంగా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తుండగా.. సార్ మీ తర్వాతి మూవీ అప్‌డేట్స్ చెప్పండంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్లలో అడుగుతున్నారు.
కుటుంబంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఫొటోలు షేర్ చేసే బన్నీ తాజాగా.. భార్య అందాన్ని పొగుడుతూ పోస్ట్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార్, ఏ దర్శకుడితో పనిచేస్తున్నారన్న విషయాలపై నటుడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment