Can You Guess Who Is the Popular Hero Behind Ashu Reddy - Sakshi
Sakshi News home page

Ashu Reddy: అషు రెడ్డి వెనకున్న ఆ పాపులర్​ హీరో ఎవరో తెలుసా !

Published Tue, Jan 25 2022 5:04 PM | Last Updated on Tue, Jan 25 2022 6:27 PM

Can You Guess Who Is The Popular Hero Behind Ashu Reddy - Sakshi

జూనియర్​ సమంతగా పెరు తెచ్చుకున్న అషు రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్​ మీడియా యూజర్లకు పెద్దగా చెప్పనవసరం లేదు. సోషల్​ మీడియాతో తెచ్చుకున్న పాపులారిటీతో బిగ్​బాస్​ ఇంట్లో అడుగు పెట్టి స్టార్​గా ఎదిగింది. ఆ తర్వాత హాట్ హాట్​ ఫొటోలను షేర్​ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అంతేకాకుండా ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్​ ఇంటర్వ్యూ వైరల్ అవడమే కాకుండా ఆమెకు 'బోల్డ్​ బ్యూటీ' అనే పేరును తెచ్చిపెట్టింది. తాను చేసే పోస్ట్​లకు యాప్ట్​ అయ్యేలా ట్యాగ్​లైన్​ రాస్తూ కూడా రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవల కూడా 'మీ కళ్లల్లోనే వేడి ఉంది' అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

సోషల్​ మీడియాలో పోస్ట్​లే కాకుండా అప్పుడప్పుడు టూర్​లకు కూడా వెళ్తూ ఉంటుంది అషు. ఇటీవల వెకేషన్​ నిమిత్తం దుబాయ్​ వెళ్లిన అషు 'మేడమ్ టూసాడ్స్'​ మ్యూజియంను సందర్శించింది. ఈ మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పలు ఫొటోలు దిగిన ఈ భామ తాను అభిమానించే బాలీవుడ్​ హీరో రణ్​బీర్​ కపూర్​ మైనపు బొమ్మతో ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్​స్టా గ్రామ్​లో షేర్​ చేస్తూ 'సారీ అలియా భట్'​ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్​పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement