Ashu Reddy Shares Her Latest Photo Shoot With Bold Caption Goes Viral - Sakshi
Sakshi News home page

మరోసారి రెచ్చిపోయిన అషురెడ్డి.. మీ కళ్లలోనే ఉందంటూ బోల్డ్‌ కామెంట్‌

Jan 12 2022 7:13 PM | Updated on Jan 18 2022 7:15 PM

Ashu Reddy Shares Her Latest Photo Shoot With Bold Caption Goes Viral - Sakshi

అషు రెడ్డి.. సోషల్‌ మీడియా యూజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌ అనంతరం స్టార్‌గా ఎదిగిన అషు, ఆ తర్వాత హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇచ్చి.. వాటిని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. అంతేకాదు తన బోల్డ్‌ కంటెంట్‌పై వీడియో చేసి తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేస్తూ తరచూ ట్రోల్స్‌ బారిన పడుతోంది. ఇక ఫేం కోసం ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్‌ ఇంటర్య్వూ  ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి అషు రెడ్డిని బోల్డ్‌ బ్యూటీ అని కూడా పిలుస్తున్నారు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్‌..

ఈ క్రమంలో తనపై వచ్చే హాట్‌ కామెంట్స్‌కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చి నెటిజన్లకు కౌంటర్‌ ఇస్తూ వస్తుంది ఈ భామ. ఈ నేపథ్యంలో అషు తన తాజా ఫొటోషూట్‌ను షేర్‌ చేసింది. తన ఫొటోలపై నెటిజన్స్‌ చేసే కామెంట్స్‌ను ముందుగానే గ్రహించిన అషు ట్రోలర్స్‌కు ఆ చాన్స్‌ ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడిందేమో. అందుకే తన ఫొటోలపై బోల్డ్‌ కామెంట్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌ చేసింది. ఈ మేరకు ఆమె ‘హాట్‌నెస్‌ నా థైస్‌లో కాదు.. మీ కళ్లలోనే ఉంది’ అంటూ బోల్డ్‌ క్యాప్షన్‌తో మోకాళ్లపైకి టాప్‌ ధరించిన ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తూ అషును ట్రోల్‌ చేస్తున్నారు. 

చదవండి: స్పెషల్‌ సాంగ్‌తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు: సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement