కుమార్తెని పరిచయం చేసిన నటి | Sneha Introduces Daughter Aadhyantaa on Husband Birthday | Sakshi
Sakshi News home page

భర్త పుట్టినరోజు సందర్భంగా కుమార్తె ఫోటోలు షేర్‌

Aug 28 2020 2:49 PM | Updated on Aug 28 2020 2:51 PM

Sneha Introduces Daughter Aadhyantaa on Husband Birthday - Sakshi

కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి స్నేహ. చెరగని చిరునవ్వుకి కెరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించారు. నటిగా ఫుల్‌ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిట్టితల్లి ఫోటోలు ఎక్కడా షేర్‌ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు స్నేహ. పాప పేరు ఆద్యంత. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. (చదవండి: స్నేహలోని కొత్త కోణం)

‘హ్యాపీ బర్త్‌డే టూ మై సోల్‌ మేట్‌.. మై లవర్‌ బాయ్‌.. గార్డియన్‌ ఏంజిల్‌.. సూపర్‌ డాడా. ఈ లడ్డులతో(పిల్లలు) నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కుమార్తె ఫోటోలు షేర్‌ చేశారు స్నేహ. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement