
మలయాళ నటుడు దిలీప్, అతని భార్య కావ్య మాధవన్ తమ కూతురు మహలక్ష్మీ తొలి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేశారు. తన కుమార్తె మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు కావడంతో.. ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో మహలక్ష్మీ తన తండ్రి దిలీప్, తల్లి కావ్యతో పాటు అక్క (దిలీప్ మొదటి భార్య కూతురు మీనాక్షి), నానమ్మలతో కనిపిస్తుంది. మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు వేడుకలకు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.
మలయాళ నటిని అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 2017లో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్‌కు మహలక్ష్మీ రెండో భార్య కూతురు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌తో 17 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ వైవాహిక జీవితానికి 2015లో ముగింపు పలికాడు. ప్రస్తుతం 51ఏళ్ల దిలీప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా శుభరాత్రి అనే చిత్రంలో కనిపించిన ఈ నటుడు, తాజాగా జాక్ డెనియల్‌తో తెర మీద కనిపించనున్నాడు.