hero dilip
-
కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో!
మలయాళ నటుడు దిలీప్, అతని భార్య కావ్య మాధవన్ తమ కూతురు మహలక్ష్మీ తొలి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేశారు. తన కుమార్తె మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు కావడంతో.. ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో మహలక్ష్మీ తన తండ్రి దిలీప్, తల్లి కావ్యతో పాటు అక్క (దిలీప్ మొదటి భార్య కూతురు మీనాక్షి), నానమ్మలతో కనిపిస్తుంది. మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు వేడుకలకు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మలయాళ నటిని అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 2017లో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్‌కు మహలక్ష్మీ రెండో భార్య కూతురు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌తో 17 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ వైవాహిక జీవితానికి 2015లో ముగింపు పలికాడు. ప్రస్తుతం 51ఏళ్ల దిలీప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా శుభరాత్రి అనే చిత్రంలో కనిపించిన ఈ నటుడు, తాజాగా జాక్ డెనియల్తో తెర మీద కనిపించనున్నాడు. -
స్టార్ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్!
తిరువనంతపురం: కేరళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మొదటినుంచీ ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇటీవల దొరికిన ఓ కీలకసాక్ష్యం ఆధారంగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో దిలీప్ వాడిన ఓ సీక్రెట్ మొబైల్ నంబర్ ఆధారంగానే ఆయన అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. ఆ నంబరే లభించడమే ఆయన అరెస్ట్‌లో కీలకపాత్ర పోషించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ కీలక సమాచారాన్ని తన ఫోన్ నుంచి ఇండస్ట్రీకి చెందిన కొందరికి పంపించాడు. ఎవరికి సమాచారం అందించాడో మాత్రం పల్సర్ సునీ వెల్లడించలేదు. కొందరికి విషయం చెప్పేశాను, నాకు డబ్బు ఇవ్వాలంటూ దిలీప్‌ను నిందితుడు సునీ డిమాండ్ చేయగా అందుకు ఆయన నిరాకరించాడు. సునీ తనను వేధిస్తున్నాడని, రూ.1.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కొన్ని రోజుల కిందట ఆయన పోలీసులను ఆశ్రయించారు. గత వారం దిలీప్‌ను పిలిపించిన పోలీసులు దాదాపు 12 గంటలపాటు ప్రశ్నించి విచారించారు. దిలీప్ భార్య కావ్య మాధవన్, మేనేజర్ అప్పుణ్ని, అనూప్ అనే మరోవ్యక్తికి ఈ నటుడు చేసిన కాల్స్ లిస్ట్ పరిశీలించగా ఓ కొత్త విషయం తెలిసింది. దిలీప్ ఓ ప్రైవట్ నంబర్‌ను వాడి తన సన్నిహితులకు కాల్స్ చేసేవారని, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు అదే నంబర్‌తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దిలీప్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు. -
మరో నటుడిని ప్రశ్నించనున్న పోలీసులు!
కొచ్చి: సంచలనం రేపిన ప్రముఖ మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మరో నటుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధం ఉన్న కేరళకు చెందిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముకేశ్‌ను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. నటిని అపహరించి.. కారులో లైంగిక వేధించిన ప్రధాన నిందితుడు పల్సర్ సుని గతంలో ముఖేశ్ డ్రైవర్ కావడం గమనార్హం. నటిపై అఘాయిత్యానికి కుట్ర పన్నిన సమయంలోనూ ముఖేశ్ డ్రైవర్‌గా పల్సన్ సుని పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. దిలీప్ సినిమా 'సౌండ్ థోమా' షూటింగ్ కొనసాగుతున్న సమయంలో ముఖేశ్ డ్రైవర్‌గా సుని ఉన్నాడు. 2013లో ఎర్నాకుళంలో జరిగిన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) షోలోనూ ముఖేశ్ డ్రైవర్‌గా సుని హాజరయ్యాడు. ఈ వివరాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ముఖేశ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ కేసులో ప్రధాన కుట్రకు కారణంగా భావిస్తున్న నటుడు దిలీప్ సోదరుడు అనూప్‌ని కూడా మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నటుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. -
రెండు రోజుల పోలీసుల కస్టడీకి నటుడు దిలీప్
ఈ కేసు వెనుక కుట్ర కోణం ఏమిటి? దిలీప్‌ను ప్రశ్నించనున్న పోలీసులు నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. నటుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, ఈ కేసులో దిలీప్‌ను కావాలని ఇరికించారని, అతను అమాయకుడినని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు ఈ కేసులో దిలీప్ కీలక నిందితుడని, అతన్ని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మూడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసుల తరఫు న్యాయవాది కోరారు. కోర్టు మాత్రం రెండురోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఇంతటి అఘాయిత్యాన్ని దిలీప్ చేయించాడని భావిస్తున్న నేపథ్యంలో దిలీప్‌ను మరింతగా లోతుగా ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కుట్రలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందే అనే కోణంలో పోలీసుల ఇంటరాగేషన్ సాగనుంది. ముఖ్యంగా కొచ్చి, త్రిశూర్‌లోని పలు చోట్ల దిలీప్ నటిపై అఘాయిత్యానికి పథక రచన చేశాడని, కాబట్టి ఆయా ప్రాంతాలకు ఆయనను తీసుకెళ్లి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకు నటిపై దిలీప్ పగ పెంచుకున్నాడు? అనే కోణంలోనూ విచారణ సాగనుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ప్రముఖ హీరో అరెస్టు!
కొచ్చి: ప్రముఖ మలయాళ హీరో దిలీప్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో దిలీప్ నిందితుడిగా ఉన్నారు. ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. ఆ రోజు ఏం జరిగిందంటే.. త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్ ముగించుకొని నటి సాయంత్రం ఏడు గంటలకు ఎస్‌యూవీలో బయలుదేరింది. ఈ ఎస్‌యూవీని ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ లాల్ క్రియేషన్స్ సమకూర్చింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమె బయలుదేరింది. ఆమె ప్రయాణిస్తున్న సమయంలోనే కారు డ్రైవర్ మార్టిన్ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్ ఇచ్చిన సమాచారంతో పల్సర్ సుని గ్యాంగ్ క్యాటరింగ్ వ్యాన్‌లో ఆమెను వెంటాడింది. ఉద్దేశపూర్వకంగా రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్పోర్ట్ జంక్షన్లో ఆమె వావానాన్ని ఆ కిరాయిమూక తమ వ్యాన్‌తో ఢీకొట్టింది. నటి కారు ఆగగానే.. ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి.. తమ చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏ-3 నిందితుడు (అతని పేరు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు. నల్ల టీషర్ట్ ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. నటిని బలవంతంగా నోరు మూసి వారు ముందుకు కదిలారు. అనంతరం మరో ఇద్దరు నిందితులు వాహనంలోకి వచ్చారు. వారు రూట్ మార్చి.. వాహనాన్ని ఓ ఇంటి ముందు ఆపారు. అక్కడి నుంచి ప్రధాన నిందితుడు పల్సర్ సుని అలియాస్ సునిల్ కుమార్ రంగంలోకి వచ్చాడు. ముఖానికి టవల్ కట్టుకొని వచ్చిన అతను డ్రైవర్ సీటులోకి మారాడు. అప్పటివరకు వాహనాన్ని నడిపిన మార్టిన్ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్ వ్యాన్‌లోకి ఎక్కాడు. పల్సర్ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీసేందుకు థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని, తనకు సహకరించాలని నటితో అతను చెప్పాడు. కాసేపు నటిని అసభ్యంగా చిత్రీకరించిన అనంతరం ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు గెంటేశాడు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. చదవండి: సంబంధిత కథనాలు లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి! హీరోయిన్ వేధింపుల కేసులో కీలక సాక్ష్యం నటి కేసు: ఎఫ్ఐఆర్లో ఏముంది? పక్కా స్కెచ్ వేసింది అతనే! ఆ రాత్రి ఏం జరిగిందంటే..! హీరోయిన్ను కారులో బందీగా చేసి..