స్టార్‌ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్! | super star Dileep arrested help of secret phone number | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్!

Published Wed, Jul 12 2017 1:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

స్టార్‌ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్!

స్టార్‌ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్!

తిరువనంతపురం: కేరళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మొదటినుంచీ ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇటీవల దొరికిన ఓ కీలకసాక్ష్యం ఆధారంగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో దిలీప్ వాడిన ఓ సీక్రెట్ మొబైల్ నంబర్ ఆధారంగానే ఆయన అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. ఆ నంబరే లభించడమే ఆయన అరెస్ట్‌లో కీలకపాత్ర పోషించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ కీలక సమాచారాన్ని తన ఫోన్ నుంచి ఇండస్ట్రీకి చెందిన కొందరికి పంపించాడు. ఎవరికి సమాచారం అందించాడో మాత్రం పల్సర్ సునీ వెల్లడించలేదు. కొందరికి విషయం చెప్పేశాను, నాకు డబ్బు ఇవ్వాలంటూ దిలీప్‌ను నిందితుడు సునీ డిమాండ్ చేయగా అందుకు ఆయన నిరాకరించాడు. సునీ తనను వేధిస్తున్నాడని, రూ.1.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కొన్ని రోజుల కిందట ఆయన పోలీసులను ఆశ్రయించారు.

గత వారం దిలీప్‌ను పిలిపించిన పోలీసులు దాదాపు 12 గంటలపాటు ప్రశ్నించి విచారించారు. దిలీప్ భార్య కావ్య మాధవన్, మేనేజర్ అప్పుణ్ని, అనూప్ అనే మరోవ్యక్తికి ఈ నటుడు చేసిన కాల్స్ లిస్ట్ పరిశీలించగా ఓ కొత్త విషయం తెలిసింది. దిలీప్ ఓ ప్రైవట్ నంబర్‌ను వాడి తన సన్నిహితులకు కాల్స్ చేసేవారని, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు అదే నంబర్‌తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దిలీప్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దిలీప్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement