Actress Shruti Haasan Karma Status Instagram Post - Sakshi
Sakshi News home page

Shruti Haasan: శ్రుతిహాసన్‌ని ఇబ్బంది పెడుతున్నది ఎవరు?

Published Fri, Aug 18 2023 1:44 PM | Last Updated on Fri, Aug 18 2023 2:47 PM

Actress Shruti Haasan Karma Status Instagram Post - Sakshi

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్. అలా పండగ విన్నర్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. త‍్వరలో ప్రభాస్ 'సలార్'తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇది ఎవరికో కౌంటర్ వేసినట్లు ఉంది. దీంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

పోస్టులో ఏముంది?
'నేను కొందరినీ గమనిస్తుంటారు. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసి సైలెంట్ గా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుంది' అని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ)

ఇబ్బంది పెట్టారా?
అయితే ఈ పోస్ట్ చూస్తే శ్రుతిహాసన్.. ఎవరికో కౌంటర్ వేస్తున్నట్లు అనిపించింది. అలానే ఈ బ్యూటీ ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారా అనే సందేహం కూడా వస్తోంది. అయితే ఇలా సడన్ గా కర్మ సిద్ధాంతం టైపులో పోస్ట్ పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది.

బాయ్ ఫ్రెండ్‌తో
గతంలో సిద్ధార్థ్, ఓ ఫారెన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారాలు నడిపిన శ్రుతిహాసన్ ప్రస్తుతం శంతను హజరికా అనే కుర్రాడితో రిలేషన్‌లో ఉంది. అయితే అతడిని ఫ్రెండ్ అని చెబుతుంది తప్పితే బాయ్ ఫ్రెండ్ అని ఎక్కడా అనట్లేదు. అయితే ప్రస్తుతం పెట్టిన కర్మ పోస్ట్ కూడా వీళ్ల రిలేషన్ గురించి ఏమైనా కామెంట్స్ చేసిన వాళ్లకా అనే సందేహం వస్తోంది. ఈ విషయాలపై స్వయంగా శ్రుతిహాసన్ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం బయటకు రాదు.

(ఇదీ చదవండి: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement