హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. పేరుకే హీరోయిన్ కానీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. నటిగా పేరు తెచ్చకున్నా, అంతకు ముందే సంగీతంపై ఆసక్తితో ఆ రంగంలో పలు ప్రైవేటు పాటల ఆల్బమ్స్ చేసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యింది. తండ్రి కమలహాసన్ హీరోగా నటించిన 'ఉన్నైప్పోల్ ఒరువన్' చిత్రానికి సంగీతమందించింది. అలానే లిరిక్ రైటర్, సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు 'సలార్' కోసం సాహసం చేసేందుకు రెడీ అయిపోయింది.
(ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ!)
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా చేస్తున్న శ్రుతి హాసన్.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. హిట్స్ అందుకుంది. ఈమె నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాకు ఈ మధ్యే శ్రుతి హాసన్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఓవరాల్ గా ఐదు భాషల్లోనూ ఈమె సొంత గొంతే వినిపించనుంది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ పూర్తి చేసిన ఈమె.. మరో రెండింటివి కూడా కంప్లీట్ చేసే బిజీలో ఉంది. సాధారణంగా హీరోయిన్లు ఒక భాషలో చెప్పడానికే తంటాలు పడుతుంటారు. అలాంటిది శ్రుతి.. ఐదు భాషల్లో చెప్పడమంటే సాహసమే. ప్రస్తుతం తెలుగులో 'హాయ్ నాన్న', ఇంగ్లీష్‌లో 'ది ఐ' అనే సినిమాలో నటిస్తోంది.
(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)
Comments
Please login to add a commentAdd a comment