
మానసిక ఒత్తిడి(డిప్రెషన్).. ప్రస్తుతం చాలామందిని బాధిస్తున్న సమస్య ఇది. కారణాలు ఏంటనేది పక్కనబెడితే దీని బారిన పడి ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు హీరోయిన్ శ్రుతిహాసన్ అద్భుతమైన చిట్కాలు చెప్పింది. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)
ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మానసిక ఒత్తిడి గురించి ఎవరూ బయటకు చెప్పడం లేదు. నేను మాత్రం వీటి గురించి డైరీలో రాసుకుంటాను. రోజూ జిమ్ చేస్తారు. దీని వల్ల శరీరంలోని రసాయనాలు, హార్మోనులు సమతుల్యం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహకరిస్తుంది.
రోజూ నచ్చిన వారితో మాట్లాడతాను. వారి మనసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో నా గురించి మాట్లాడుకునే విషయాల్లో మంచి-చెడు గురించి ఆలోచిస్తానని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్ 'సలార్'లో హీరోయిన్. అలానే హాలీవుడ్ మూవీ 'ది ఐ'లోనూ యాక్ట్ చేసింది.
(ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment