సోషల్ మీడియాలో మహేశ్ ఫస్ట్ పోస్ట్.. వైరల్ | Mahesh Babu first post in instagram goes viral | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో మహేశ్ ఫస్ట్ పోస్ట్.. వైరల్

Published Thu, Jan 25 2018 5:04 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Mahesh Babu first post in instagram goes viral - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కేవలం రెండు రోజుల్లోనే 6.8 లక్షల మంది ఫాలోయర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ తొలి పోస్టుకు అనూహ్యమైన స్పందన వస్తోంది. తన లేటెస్ట్ ప్రాజెక్టకు సంబంధించిన ఓ ఫొటో అప్‌లోడ్ చేసిన మహేశ్.. ‘రేపు ఉదయం 7 గంటలకు’  అంటూ చేసిన తొలి పోస్టును గంట వ్యవధిలోనే 22 వేల మంది లైక్ చేశారు.

గతంలో తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో కియారా అద్వాని కథానాయిక. మహేశ్ సీఎం పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్ కాగా, రిపబ్లిక్‌ డే.. ఉదయం ఏడు గంటల సమమానికి రెడీగా ఉండండి. ఆల్‌ ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో భరత్‌ ఫస్ట్‌ ఓత్‌ (ప్రమాణం) వినడానికి అంటూ ఇటీవల యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ పోస్టర్ ను మహేశ్ అప్‌లోడ్ చేయగా ఆయన ఫాలోయర్లు టాలీవుడ్ ప్రిన్స్ తొలి ఇన్‌స్టాగ్రామ్ సందేశంపై స్పందించి లైక్స్, కామెంట్లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.

7 AM. Tomorrow.

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement