Manchu Manoj Shared Manchu Lakshmi School Adaptation - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: అక్కని ఆకాశానికెత్తిన తమ్ముడు.. పోస్ట్ వైరల్!

Published Thu, Jul 13 2023 7:26 PM | Last Updated on Thu, Jul 13 2023 7:51 PM

Manchu Manoj Post Manchu Lakshmi School Adaptation - Sakshi

Manchu Lakshmi Manchu Manoj: మంచు లక్ష‍్మీ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె చాలా నార్మల్‌గా మాట్లాడినా సరే ఆ కామెంట్స్, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ఫన్నీగానే ఆమెని ట్రోల్ చేస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే ఆమె మంచి పనులు కూడా చాలానే చేస్తోంది. కాకపోతే అవి తక్కువగా హైలెట్ అవుతున్నాయి. అలా ఓ విషయమై ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ మంచు మనోజ్ తెగ పొగిడేశాడు. 

(ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!)

స్కూల్స్ దత్తత
ప్రస్తుతం చాలామంది పిల్లలు సరైన చదువు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై దృష్టి సారించిన మంచు లక్ష‍్మీ.. టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ని దత్తత తీసుకుంటోంది. గతేడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలని దత్తత తీసుకుంది. ఆయా స్కూల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. అలా ఓ రెండు వారాల ముందు గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలల్ని ఈమె దత్తత తీసుకుంది.

తమ్ముడి పొగడ్తలు
కొన్నాళ్ల ముందు మంచు లక్ష‍్మీ చేసిన ఈ మంచి పని గురించి ఆమె తమ‍్ముడు ఇన్ స్టాలో ఇ‍ప్పుడు పోస్ట్ పెట్టాడు. 'మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు' అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement