
టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తరువాత ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్’కు ఆదరణ పెరిగింది. అయితే కొందరు తమ ఒరిజినల్ కంటెంట్ షేర్ చేస్తుండగా.. మరికొందరు యూజర్లు టిక్‌టాక్ లాంటి ఇతర యాప్స్ లోని వీడియోలను రీసైకిల్ చేసి ‘రీల్స్’కు పోస్ట్ చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించింది ఇన్‌స్టాగ్రామ్. ఇక కొత్త ఫీచర్ల విషయానికి వస్తే... ట్యాగ్, ఇంప్రూవ్‌డ్ ర్యాంకింగ్ కోసం ఇన్‌స్టా తాజాగా ప్రాడక్ట్ ట్యాగ్స్, ఎన్‌హ్యాన్స్‌డ్ ట్యాగ్స్, ర్యాంకింగ్ ఫర్ ఒరిజినాలిటీ అనే ఫీచర్లను లాంచ్ చేసింది.